ఏపీలో జనసేన బలం పెరిగిందా? పవన్ కల్యాణ్‌పై ప్రజలకు నమ్మకం పెరిగిందా? నెక్స్ట్ ఎన్నికల్లో పవన్‌కు...ఫ్యాన్ రెక్కలు విరగొట్టే సత్తా ఉందా? అంటే జనసేన నాయకులు ఉందనే చెబుతున్నారు. అధికార వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, వైసీపీ నేతలు అక్రమాలు కూడా పెరిగిపోయాయని, ఇక ప్రజలు వైసీపీని ఆదరించే ప్రసక్తే లేదని జనసేన నాయకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్‌పై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, వచ్చే ఎన్నికలలో జగన్ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి ప్రజలు బుద్ది చెబుతారని జనసేన నేత పోతిన మహేష్ అంటున్నారు.