ఎప్పుడైనా రాజకీయాల్లో నాయకులు...ప్రత్యర్ధులపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. విమర్శలు ఎప్పుడు హద్దు దాటకుండా ఉండాలి. అప్పుడే ప్రజలు కూడా అలాంటి విమర్శలని అంగీకరిస్తారు....ఆ విమర్శలపై ఆలోచన చేస్తారు. అయితే ఇలా ఓ పదేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నడిచేవి. అంటే ఉమ్మడి ఏపీలో విలువలతో కూడిన రాజకీయాలు జరిగేవి. ఇక రాష్ట్ర విభజన జరిగాక, ఇటు ఏపీలో కావొచ్చు...అటు తెలంగాణలో కావొచ్చు. అధికార పార్టీ కావొచ్చు...ప్రతిపక్ష పార్టీ కావొచ్చు..నాయకులు బూతులు మాట్లాడకుండా ఉండటం లేదు.