గత కొన్నిరోజులుగా వైసీపీ ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం అప్పుల్లో మునిగిపోయిందని పరిమితికి మించి అప్పులు తెచ్చి, ప్రజల నెత్తి మీద భారం పెడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం మీద సీరియస్గా ఉందని కథనాలు వస్తున్నాయి. అటు ఇసుక, మద్యం విషయంలో ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నాయి.