అధికార వైసీపీలో అనూహ్యంగా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎమ్మెల్యేల్లో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ముందు వరుసలో ఉంటారు. రెండోసారి ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి అధికార ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తున్నారు. ప్రతిరోజూ ప్రజలని కలుసుకుంటూ, వారి సమస్యలని తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండటంలో కేతిరెడ్డి ముందు ఉంటున్నారు.