ఏపీలో రాజకీయాలు ఎలా మారినా, ఏ పార్టీ పరిస్తితి ఎలా ఉన్నా సరే....టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటేనే కొన్ని స్థానాల్లో టీడీపీకి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉన్నా సరే కొన్ని స్థానాల్లో పవన్ కల్యాణ్ సపోర్ట్ లేకపోతే కొందరు తెలుగు తమ్ముళ్ళు గెలుపు రుచి చూడటం కష్టం. ఆ విషయం 2019 ఎన్నికల్లోనే బాగా అర్ధమైందని చెప్పొచ్చు. అప్పుడు పవన్ విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి, కొన్ని స్థానాల్లో టీడీపీ నాయకులు ఓటమిని చవిచూశారు. అదే వైసీపీకి అడ్వాంటేజ్ అయి గెలిచింది.