బొత్స సత్యనారాయణ...ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఈయనే కీలకం అయినట్లు కనిపిస్తోంది. సిఎం జగన్ మోహన్ రెడ్డి, ఫ్యామిలీతో కలిసి సిమ్లా టూర్కు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక వైసీపీలో నెంబర్ 2గా ఉండే విజయసాయిరెడ్డి కూడా రాష్ట్రంలో లేరు. ఈ పరిస్తితుల్లో బొత్స సత్యనారాయణ లీడ్ తీసుకున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ మంత్రిగా బొత్సదే ఇప్పుడు పెత్తనమని అంటున్నారు.