ధర్మాన ప్రసాదరావు....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు...దశాబ్దాల పాటు కాంగ్రెస్లో పనిచేసిన నాయకుడు. శ్రీకాకుళం జిల్లాలో కీలక నేత. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మాన... నేదురుమల్లి, కోట్ల, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసిన నాయకుడు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగవ్వడంతో ధర్మాన వైసీపీలోకి వచ్చేసి...2019 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం పోటీ చేసి గెలిచారు. పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో ధర్మానకు మంత్రి పదవి రావడం ఖాయమనే అంతా అనుకున్నారు.