విజయసాయిరెడ్డి...ఈ పేరు చెబితే చాలు ప్రతిపక్ష టిడిపి నాయకులకు ఎక్కడా లేని ఆగ్రహం వచ్చేస్తుంది. జగన్ అంటే కాస్త అటు ఇటు ఆలోచిస్తారేమో గానీ, విజయసాయి అంటే మాత్రం టిడిపి నాయకులు, కార్యకర్తలకు మామూలు కోపం రాదు. ఎందుకంటే అంతలా ఆయన..టిడిపిని ఆడేసుకుంటారు. వైసీపీకి బ్యాక్ బోన్‌లా ఉన్న విజయసాయి...ప్రతిపక్ష టిడిపిపై దూకుడుగా విమర్శలు చేయడంలో ముందుంటారు. అలాగే ఊహించని ఆరోపణలు గుప్పించడంలో కూడా విజయసాయి ముందుంటారు.