పేరుకు పెద్దదేశం, నాగరికతను ప్రపంచానికి నేర్పిన నేల,మానవుని ఉనికేలేని ఇప్పటి ఎన్నోదేశాలు ఉన్నవేల నవ జీవనం సాగించిన భరతభూమి అయినా సరే మన జాతికి జాతీయక్రీడ లేదు. లేదని కాదు మనమే ప్రపంచానికి ఆవిష్కరించిన క్రీడలెన్నో ఉన్నా ఒక్కదానికి కూడా జాతీయక్రీడగా గుర్తింపునివ్వలేదు ఈనేలను ఏలిన పాలకులు. త్రివేణి సంగమ పవిత్రభూమి,నాలుగువేదములు పుట్టినభూమి,గీతామృతమును పంచినభూమి,పంచశీల భోధించినభూమి పంచశీల భోధించిన భూమి...భారతమాతకు జేజేలు మన బంగరుభూమికి జేజేలు అని జబ్బలు చరుచుకుంటున్న మన నేతలు సిగ్గుపడాల్సిన విషయం. అన్నీరంగాల్లో విద్యారంగం,క్రీఢారంగాలే ప్రధానం అలాంటిది ఇప్పటివరకు జాతీయక్రీడగా దేనికి గుర్తింపు ఇవ్వక ఏక్రీడలోను రాణించక ప్రపంచం ముందు పరువు పోగొట్టుకుంటున్నాం. మనదేశంలోని ఒక జిల్లాతో సమానంగా లేని ఎన్నోదేశాలు ఒలంపిక్స్ లో పతకాలపంట పండిస్తుండగా మనం మాత్రం ఒక్కపతకం కోసం మొఖం వాచిపోయేలా ఎదిరిచూడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ఒలంపిక్స్ లో వరుసగా ఎనిమిదిసార్లు స్వర్ణపతకాలు మనదేశానికి అందించిన హాకీ కూడా జాతీయక్రీడగా గుర్తింపుకు నోచుకోలేదు. పైగా ఈ క్రీడకు పురుడుపోసిన నేల మనదేశమే. పలితం ప్రస్తుతం ఇదేక్రీడలో మనదేశం ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు క్వాలిఫై మ్యాచ్ లు ఆడాల్సిన దుస్థితి. ఒకప్పుడు మనదేశంలో ఉన్న రాజ్యాలమద్య ముష్టియుద్దపోటీలు ప్రతిష్టాత్మకంగా జరిగేవి.ఇందులో రాజ్యాలనే పనంగా పెట్టేవారు, అదే ఇప్పటి బాక్సింగ్. స్విమ్మింగ్,షూటింగ్,ఇలా నేడు ఒలంపిక్స్ లో ప్రధానక్రీడలు ఎన్నొ మననేలపైనే వెలిసాయి. నేడు చిన్నదేశాలు సైతం జాతీయక్రీడను పెట్టుకున్న సమయంలో మనజాతి దానికి నోచుకోకపోవడం క్రీడాభిమానులకే కాదు,యావత్ భారతజాతికే అవమానకరం.జాతీయపక్షి,జాతీయమృగం ఉన్నప్పటికి జాతీయక్రీడ లేకపోవడం చూస్తుంటే మనపాలకులు క్రీడారంగాన్ని ఎంతచిన్నచూపు చూస్తున్నారో అర్థమవుతోంది.ఇన్నాళ్లు హాకీ మనజాతీయ క్రీడ అని చాలామంది అనేవారు.కాని ఓ పదేళ్లబాలికకు వచ్చిన అనుమానం ఈదారుణ నిజాన్ని బయటపెట్టింది.లక్నోకు చెందిన ఐశ్వర్య పరాశర్ అనే బాలిక సమాచార హక్కు చట్టం కింద ప్రధానమంత్రి కార్యాలయానికి చేసుకున్న అభ్యర్థన మేరకు మనదేశానికి జాతీయక్రీడ ఏది లేదంటూ కేంధ్రక్రీడల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇది గొప్పలు చెప్పుకునే మననేతల తీరు.
మరింత సమాచారం తెలుసుకోండి: