-
anitha singer
-
Assembly
-
Bonda Umamaheswara Rao
-
CBN
-
Chintamaneni Prabhakar
-
CM
-
Congress
-
Dogs
-
Government
-
Governor
-
Kamma
-
Kunamneni Sambasiva Rao
-
March
-
MLA
-
monday
-
MP
-
Nagari
-
Parakala Prabhakar
-
paritala ravindra
-
Party
-
politics
-
prabhakar
-
Rayapati Sambasivarao
-
Reddy
-
Roja
-
sunday
-
TDP
-
Telangana
-
Telangana Rashtra Samithi TRS
-
YCP
-
Yeluri Sambasiva Rao
-
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే...
టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులను అభ్యర్థులుగా ఖరారు చేశారు. గవర్నర్ కోటాలో డి. రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ మరోసారి అవకాశం దక్కించుకున్నారు. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
రేపటి నుండే ఆంధ్రాలో తొలి అసెంబ్లీ సమావేశాలు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం వెలగపూడిలోని నూతన సచివాలయ భవనం సర్వహంగులతో సిద్ధమైంది. సోమవారం ఉదయం గవర్నర్ నరసింహన్ ఉమ్మడి సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అధికార ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాలతో శాసనసభ సమావేశాలకు సిద్ధమయ్యాయి. నవ్యాంధ్ర గడ్డమీద తొలి అసెంబ్లీ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
అనిత కాళ్లు పట్టుకొని రోజా క్షమాపణ చెప్పాల్సిందే...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంగలపూడి అనిత కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పిన తర్వాతే అసెంబ్లీకి రావాలని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఆదివారం అన్నారు. రోజాకు అసెంబ్లీలో కనీసం అటెండర్ కూడా భయపడడని విమర్శించారు. సోమవారం ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రోజాను అసెంబ్లీకి అనుమతిస్తారా లేదా అనే చర్చ సాగుతోంది.
జేసీ బ్రదర్స్ పరిటాల కాళ్లు పట్టుకున్నారన్న వైసీపీ..
అనంతపురంలో ఉండేందుకు జేసీ సోదరులు గతంలో మాజీ మంత్రి, టిడిపి నేత పరిటాల రవి కాళ్లు పట్టుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి ఆదివారం విమర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ ఊర కుక్క అని, గతంలో పరిటాల దెబ్బకు జేసీ సోదరులు పరారయ్యారని వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జేసీ సోదరుల్ని అడ్డు పెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే జగన్‌ను నేరుగా ఎదుర్కోవాలన్నారు.
చంద్రబాబు తీరుపై ఎంపీ రాయపాటి ఆగ్రహం...

సీఎం చంద్రబాబు తీరుపై ఎంపీ రాయపాటి సాంబశివరావు ఫైర్ అయ్యారు. చంద్రబాబు కమ్మ కులాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఓట్లు...తన పదవి కోసం బాబు ఓ కులానికి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. టిడిపిలో నేను జూనియర్‌ను..అందుకే గట్టిగా ప్రశ్నంచలేకపోతున్నానని వివరించారు.టీడీపీలోని కమ్మ నేతలు చంద్రబాబును ప్రశ్నించే స్థితిలో లేరని అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి