హైదరాబాద్: మెదక్ జిల్లాలో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురైన విషయంలో ప్రభుత్వం స్పందించింది. కల్తీకల్లు విషయంలో బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. కల్తీకల్లు తాగి అనేక మంది అస్వస్థతకు గురైన పలు దుకాణాల కల్లు దుకాణాల లైసెన్సులను ఎక్సయిజ్ అధికారులు రద్దు చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కాళ్లకల్లులో కల్తీకల్లు సేవించి వందకు మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ లోని మెడిసిట్ ప్రయివేట్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స తరలించారు. అయినప్పటికీ అనేక మంది ఇప్పటికీ కోలుకోలేరు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఇదే జిల్లాలోని మిరుదొడ్డి మండంలోని చెప్యాలలో కల్తీకల్లు తాగి అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ మహిళ చనిపోయింది. కాళ్లకల్లు పరిస్థితి కూడా అలాగే వుంది. ఈ నేపధ్యంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. కల్తీకల్లుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనితో సంబంధిత అధికారులు విచారణ చేసి కల్తీకల్లుకు బాధ్యులనైన వారిపై కేసులను నమోదు చేశారు. దుకాణాలను కూడా రద్దు చేశారు. ఇప్పటికే కొందర్ని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: