అందమైన అమ్మాయిలను చూడటమంటే కొందరికి చాలా ఇష్టం.. ఇష్టం మాత్రేమే కాదు.. ఆదో పిచ్చి.. అందులోనూ ఆ అందమైన అమ్మాయిలు హీరోయిన్లయితే.. ఆ పిచ్చి ఇంకా ముదురుతుంది. ఇదిగో ఈ యువకుల, మగాళ్ల బలహీనతలనే కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. హీరోయిన్ల ఫోటోలను నెట్ లో పెట్టేసి డబ్బు సంపాదిస్తున్నారు. 

heroine photo MORPHING కోసం చిత్ర ఫలితం
అయితే హీరోయిన్ల ఫోటోలను యాజ్ ఇట్ ఈజ్ గా చూపించే వెబ్ సైట్లు చాలా ఉంటాయి. అందుకే.. తమ సైట్లకు ర్యాంకింగ్ బాగా రావడానికి కొందరు లుచ్చాగాళ్లు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి.. ఫోటో షాప్ చేసి అశ్లీలంగా చూపుతున్నారు. పోర్న్ స్టార్ల ఫోటోల్లోని తలలను వేరు చేసి హీరోయిన్ల తలలు అతికించి నెట్లో పెడుతున్నారు. 

heroine photo MORPHING కోసం చిత్ర ఫలితం
ఇదిగో ఇలా చేస్తూనే హైదరాబాద్ లో ఓ దుర్మార్గుడు దొరికిపోయాడు. ఈ యువకుడ్ని సీఐడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఇలాంటి కిలాడీల గురించి ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన సీఐడీ పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఐదుగుర్ని అరెస్టు చేశారు.

heroine photo MORPHING కోసం చిత్ర ఫలితం

మంగళవారం హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన రఘువరుణ్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఖతర్నాక్ పోరగాడు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. హీరోయిన్ల ఫోటోలను ఫోటోషాప్ ద్వారా మార్ఫింగ్ చేసి ఓ బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాడు. దీని ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు. పోలీసుల విచారణలో రఘు బాగోతం బయటపడింది. సీఐడీ అధికారులు రఘును అరెస్ట్ చేసి ఊచల వెనక్కి పంపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: