ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత లోకేశ్ పెద్దగా జనంలోకి రావడం లేదు.. అటు చంద్రబాబు కూడా ప్రజాసమస్యలపై యాత్రల్లాంటివి చేయడం లేదు. మొన్న పడవ ప్రమాదం ఘటన సమయంలోనూ చంద్రబాబు బయటకు రాలేదు. జనంలోకి వెళ్లడానికి ముఖం లేకే ఇలా చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.


యువతకు ఉద్యోగాలు రావడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుగా ఆయన ప్రవర్తన కనిపిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అనుమానం వ్యక్తం చేశారు. పప్పు బాబు, చంద్రబాబు ఇద్దరూ కలిసి ఈ మధ్య ట్వీట్లు వేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు పప్పు, చంద్రబాబుకు ముఖం లేదు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో చంద్రబాబు దొంగ పనులన్నీ బట్టబయలు అవుతున్నాయి. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రతి గడపకు చేరాలని గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశాం. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంత నిసిగ్గుగా మాట్లాడడం దుర్మార్గమని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు.


పార్థసారధి ఇంకా ఏమన్నారంటే.. గత ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే వాటిని భర్తీ చేయడానికి టీడీపీ ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైనా డీఎస్సీ అనౌన్స్‌ చేసినా రకరకాల కారణాలతో దాన్ని పోస్టుపోన్‌ చేసుకుంటూ పోయారు. ఆ ఖాళీలు పూరించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అవినీతికి తావు లేకుండా మార్కుల ఆధారంగా ఉద్యోగాలు వచ్చే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలు నిర్వహిస్తే దానిపై చంద్రబాబు, ఆయన కొడుకు, టీడీపీ నాయకులు అక్కసు వెల్లగక్కుతున్నారు.


పరీక్షా ఫలితాల్లో బలహీనవర్గానికి చెందిన మహిళ టాపర్‌గా నిలబడింది. కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఒక చెల్లి టాపర్, ఒక సైకిల్‌ మెకానిక్‌ కుమారుడు, ఓ కౌలు రైతు కుమారుడు టాపర్లుగా నిలబడ్డారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధిస్తే చంద్రబాబు, ఎల్లో మీడియా దీనిపై చాలా కథలు అల్లుతున్నారు...అంటూ పార్థసారధి విరుచుకుపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: