మార్కెట్లో టమాటాల రేటు కిలో 60 రూపాయలు ఉంది. అక్కడే కొన్నాళ్లపాటు అక్కడే టమాటాలు కొంటానని ఒప్పందం చేసుకున్నాడో పెద్దాయన. ఒప్పందం చేసుకున్న కొన్నాళ్లకు రేటు బాగా పడిపోయింది. కిలో పది రూపాయలకే మార్కెట్లో వేరే చోట దొరుకుతోంది. తెలివైన వాడు ఏం చేస్తాడు.. బాబూ.. టమాటా రేటు తగ్గింది.. నువ్వు రేటు తగ్గించకపోతే.. నేను వేరే ఎక్కడైనా కొనుక్కుంటాను అని బేరమాడతాడా.. లేదా.. అబ్బే మనం ఒప్పందం చేసుకున్నాం కదా.. నీ దగ్గరే రూ. 60 కే కొంటానులే అంటాడా..


ఈ ప్రశ్నకు సమాధానం ఎవరైనా సింపుల్ గానే చెబుతారు. చౌకగా వస్తున్నప్పుడు ఎక్కువ రేటు పెట్టి ఎవరూ కొనరు. కానీ చంద్రబాబు వంటి నేతలు కొంటారంటోంది వైసీపీ. ఎందుకంటే ఆ కొనే సొమ్ము ప్రజలది కదా.. ఇందుకు విద్యుత్ ఒప్పందాల సంగతే వైసీపీ వివరిస్తోంది. విద్యుత్ కొనుకోలు ఒప్పందాలపై వైసీపీ వివరణ ఎలా ఉందంటే..

“ దేశంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ధరలు తగ్గాయి. కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది కూడా. 2010లో యూనిట్ రూ.18 ఉన్న సౌర విద్యుత్ ధర 2018లో రూ.2.18 పైసలకు చేరింది. పవన్ విద్యుత్ ఉత్పత్తి ధర సైతం మూడేళ్లలోనే గరిష్టంగా తగ్గి యూనిట్ రూ.4.20 నుంచి రూ.2.43 కు చేరింది. ఈ విషయాన్నిపార్లమెంట్లో ప్రస్తావించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 3వేల మెగావాట్ల పవన్ విద్యుత్ ను యూనిట్ రూ. 4.84 లకు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది.


అది కూడా ధర్మల్, హైడ్రో పవర్ తక్కువ ధరకే లభిస్తున్నప్పుడు కూడా ఇంత అధికంగా ప్రైవేటు సంస్థలకు ఎందుకు చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారో బాబుగారికే తెలియాలి. చంద్రబాబు చర్యల వల్ల ప్రభుత్వ డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయని, రోజుకు 7 కోట్లు నష్టం వస్తోందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసి చూపించారు.అధిక ధరల విద్యుత్ వల్ల పారిశ్రామిక రంగానికి భారంగా ఉందని తెలియజేసారు.


హైకోర్టు తాజా నిర్ణయంతో విద్యుత్ ఒప్పందాలపై సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. విచ్చలవిడి ఖర్చులతో ఖజానాను ఖాళీ చేసిన చంద్రబాబు తుగ్లక్ నిర్ణయాలను నేడు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో శ్రమలకు ఓర్చి సరిదిద్దుతోంది. కేంద్రం, పెట్టుబడి సంస్థల ఒత్తిడులను అధిగమిస్తూ పిపిఎల పునః సమీక్షకు మార్గం సుగమం చేసుకున్న సీఎం పంతం రాష్ట్రానికి గుదిబండగా మారిన ఖర్చులనుంచి ఉపశమనం కలిగించిందంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు.”.. ఇదీ వైకాపా వాదన


మరింత సమాచారం తెలుసుకోండి: