తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమ్మె  45వ రోజుకు చేరుకుంది. కాగా  ఈ సమ్మె ఎఫెక్ట్ తో  రాష్ట్రంలోని ప్రజల పైన తీవ్రంగా పడింది. రాష్ట్రంలో సమ్మెతో బస్సులు సరిగ్గా తిరక్క  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆర్టీసీ జేఏసీ నేతలు తమ భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఇందిరాపార్కు వద్ద మహాదీక్ష తలపెట్టిన  విషయం తెలిసిందే. ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఆర్టీసీ జేఏసీ నాయకులు తలపెట్టిన మహా దీక్ష కాస్త  ఓ యువకుడు నిశ్చితార్థాన్ని ఆపేసింది. సోమాజిగూడలోని ఎమ్మెస్ మక్తా కు  చెందిన  వెంకటేష్  కు ఇందిరా పార్క్ సమీపంలో ఉండే ఓ యువతితో పెళ్లి సంబంధం కుదిరింది.

 

 

 దీంతో ఇరు కుటుంబ సభ్యులు నిన్న నిశ్చితార్థం జరిపేందుకు నిర్ణయించారు.ఇందుకోసం  ఇరు  కుటుంబ సభ్యులు నిశ్చితార్థం  జరిపేందుకు నిర్ణయించి... నిన్న  ఉదయం 11 గంటలకు ముహూర్తం  ఫిక్స్ చేసారు.  కాగా నిన్న 10 గంటలకు యువకుడి కుటుంబసభ్యులు వాహనంలో యువతీ  ఇంటికి బయలుదేరారు. అయితే ఆర్టీసీ జేఏసీ నేతలు తలపెట్టిన మహా దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు ఇందిరాపార్క్ వద్దకు వెళ్లేదారులు  అన్నిటినీ మూసివేశారు. దీంతో వెంకటేష్ కుటుంబ సభ్యులకు తిప్పలు మొదలయ్యాయి. నిశ్చితార్థం కోసం కుటుంబ సభ్యులతో బయలుదేరిన వెంకటేష్ కు  లిబర్టీ  వద్దకు చేరుకోగానే అక్కడ అడ్డంగా బారికేడ్లు కనిపించాయి. దీంతో హిమాయత్ నగర్ మీదుగా యువతి ఇంటికి వెళ్లి నిశ్చితార్థం జరపాలని  భావించగా... అక్కడికి వెళ్ళిన అనుమతించలేదు పోలీసులు. చేసేదేమీ లేక క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలని భావించ గా అక్కడకు వెళ్లిన పోలీసులు వారిని తిప్పి  పంపించారు . ఇక చేసేదేమీ లేక అమ్మాయి తరపు వారికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు.

 

 

 

 అయితే అమ్మాయి తరుపు కుటుంబ సభ్యులు కట్ట మైసమ్మ గుడి నుంచి రావాలని సూచించారు. వారు  చెప్పినట్లే కట్ట మైసమ్మ గుడి వద్దకు చేరుకోగానే అక్కడ వారికి బారికేడ్లు దర్శనమిచ్చారు. దీంతో విసిగిపోయిన వెంకటేష్ కుటుంబ సభ్యులు తాము  నిశ్చితార్థం కోసం వెళుతున్నామని వదిలి  పెట్టాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చేసేదేమీ లేక నిశ్చితార్థాన్ని వాయిదా వేసుకుని వెంకటేష్ కుటుంబ సభ్యులు వెనుతిరిగారు. ఆర్టీసీ సమ్మె ఎఫెక్టు ప్రయాణికులపై పడింది అనుకున్నాము  కానీ...  పెళ్లిళ్లు చేసుకునే వారిపై కూడా పడుతుండటం  ఆసక్తిగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: