దిశను అమానవీయంగా అత్యాచారం చేసి చంపిన వారి గురించి ప్రపంచానికి తెలిసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. వారి చూసేందుకు చాలా చిన్నపిల్లల్లా ఉన్నారు. ఒకరిద్దరేమో మైనర్లేమో అనిపించేంతగా ఉన్నారు. దిశ కూడా ఫోన్లో ఓ చిన్న పిల్లాడు అంటూ మాట్లాడదింది. అంతా 20 – 25 ఏళ్ల ఏజ్ గ్రూప్ వాళ్లే.. ఏదేమైనా వారు చేసింది చాలా దారుణమైన నేరం. క్షణికావేశంలో , మద్యం మత్తులో ఇలా చేశారని అంతా అనుకున్నారు.

 

కానీ ఇప్పుడు వారి గురించి భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారికి ఈ దిశ ఘటనే కొత్తది కాకపోవచ్చంటున్నారు పోలీసులు. గతంలోనూ వారు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. మహమ్మద్ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నరేశ్, చింతకుంట చెన్నకేశవులను గత నెల 30చర్లపల్లి జైలుకు తరలించారు. పది రోజుల పాటు పోలీసు కస్టడీకి మెజిస్ట్రేట్ ఇచ్చారు. 4చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. విచారణలో వాళ్లు చాలా విషయాలు చెప్పారట.

 

నిందితులు చెప్పిన విషయాలను బట్టి చూస్తే వారు కరడు గట్టిన నేరస్తులను పోలీసులు చెబుతున్నారు. బహుశా కర్ణాటక, తెలంగాణల్లోనూ ఇలాంటి మరికొన్ని నేరాలు వారి చేసినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తామని చెబుతున్నారు. ఎన్ కౌంటర్ సమయంలో వారు ప్రవర్తించిన తీరు కూడా వారు కరడుగట్టి నేరస్తులే అని రుజువు చేస్తోందని పోలీసులు చెబుతున్నారు.

 

బాధితురాలిని దహనం చేసిన ప్రాంతంలో ఫోన్ దాచిపెట్టామని చెబితే.. తెల్లవారుజామున నిందితులను తీసుకొచ్చారు. వాటిని ఇక్కడ పెట్టాం.. అక్కడ పెట్టాం అంటూ.. నలుగురూ కాసేపు సమయం వృథా చేశారు. అనంతరం పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేయడం ప్రారంభించారు. కొద్దిసేపటికి ఆరీఫ్, చెన్నకేశవులు.. పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కుని కాల్పులు జరిపారు. సరెండర్ అవ్వమని ఆదేశించినా వినలేదని... వారు కరుడుగట్టిన నేరస్థులని పోలీసులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: