అగ్రరాజ్యం రష్యాకు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ దేశాల ముందు తలెత్తుకోలేని అనుభవం ఎందురైంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌, 2022 వింటర్‌ ఒలింపిక్స్‌ సహా మరే ప్రపంచపోటీల్లో పాల్గొనకుండా రష్యాపై నిషేధం వేటుపడింది. ఇక ఆ దేశం అంతర్జాతీయ క్రీడల్లో నాలుగేళ్ల పాటు పాల్గొనే అవకాశమే లేదు. ఎందుకంటే.. డోపింగ్‌ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మాస్కో ప్రయోగశాలకు సంబంధించి తప్పుడు వివరాలను ఇవ్వడమే ఇందుకు కారణం.

 

అందుకే.. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా నాలుగేళ్లు నిషేధం విధించాలన్న సమీక్ష కమిటీ ప్రతిపాదనను ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంఘం.. వాడా పచ్చ జెండా ఊపేసింది. రష్యాపై ఇలాంటి ఆరోపణలు కొత్త కాదు..2011-15 కాలంలో ప్రభుత్వమే డోపింగ్‌ను ప్రోత్సహించిందని మెక్‌లారెన్‌ స్వతంత్ర నివేదిక 2016లో బయటపెట్టింది కూడా.

 

రష్యా డోపింగ్‌ నిరోధ సంఘంపై నాలుగేళ్ల నిషేధాన్ని వాడా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మూకుమ్మడిగా ఆమోదించిందని.. వాడా అధికార ప్రతినిధి జేమ్స్‌ ఫిట్జ్‌గెరాల్డ్‌ చెప్పారు. అయితే ఓ చిన్న వెసులు బాటు ఉంది. రష్యా క్రీడాకారులు తటస్థులుగా ఉంటే ఒలింపిక్స్‌కు అనుమతిస్తారు. కానీ మళ్లీ ఓ మెలిక ఉంది. వారు ప్రభుత్వ ప్రోత్సాహక డోపింగ్‌ వ్యవస్థలో భాగస్వాములు కాలేదని హామీ ఇవ్వాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: