నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి టిడిపి పార్టీ లాగేసుకుని మోసం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే . ఇక  పార్టీ పగ్గాలు తన చేతికి వచ్చినప్పుడు నుంచి చంద్రబాబు నాయుడు పార్టీలో నేతలందరికీ అన్ని తానై  ముందుకు నడిపించాడు. ప్రతి విషయంలో పార్టీ నేతలందరికీ దిశానిర్దేశం చేస్తూ తెలుగుదేశం పార్టీని... పార్టీ నేతలు అందరిని ముందుకు నడిపించారు చంద్రబాబు. అయితే టిడిపి పార్టీని  వీడి చాలా మంది నేతలు వెళ్ళిపోయారు చాలా మంది నేతలు పార్టీలో చేరారు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా.. పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. 

 

 

 ఇక 2014 ఎన్నికల్లో జనసేన మద్దతు కూడగట్టుకొని... బాబోరు విజయం సాధించారు. అయితే చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో ప్రజలు పూర్తి వ్యతిరేకత వచ్చేలా చేసుకున్నారు. ఇక ఆ తర్వాత... 2019 ఎన్నికల్లో ప్రజలు టిడిపి పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని తెలిసినప్పటికీ పార్టీ నాయకులు అందరిలో గెలుస్తామనే నమ్మకం కలిగించి... అన్ని తానై ముందుండి పార్టీ నేతలందరి నడిపించారు.. కానీ చివరికి బాబు సాధించిందేమిటి... ఏపీ ప్రజలంతా బాబోరినీ బొక్క బోర్లా పడేలా చేసారు. 

 

 

 అప్పటికే భారీ షాక్ లో అయోమయం లో పడిపోయిన చంద్రబాబు నాయుడు... వైసిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని తిప్పలు మొదలయ్యాయి. టిడిపి పార్టీ పగ్గాలు చేపట్టిన అప్పటినుంచి పార్టీకి ఎన్ని ఓటమిలు  ఎన్నో గెలుపులు ఎన్నో  ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అన్నీ తానై  ముందుండి నడిపించిన చంద్రబాబుకి.. 2019 లో మాత్రం షాక్ ల మీద షాక్ లు తగులాయి . టిడిపి ఎన్నడూ చూడని  ఘోర పరాజయాన్ని చవి చూడడం... టిడిపి పార్టీ నుంచి ఎన్నో ఏళ్లుగా ఉన్న కీలక నేతలు పార్టీని వీడడం.. టిడిపి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతున్న  తరుణంలో పార్టీని వీడిన నేతలందరూ చంద్రబాబు పైనే ఘాటు విమర్శలు చేయడం.. ఇలా ప్రతి విషయంలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి. అన్ని తానై  పార్టీని నడిపించిన చంద్రబాబు నాయుడికి చివరికి దక్కింది ప్రజల నుండి సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: