కొన్ని కొన్ని సార్లు కొన్ని వస్తువులు నగదు బంగారం దాచిపెట్టి అలాగే మర్చిపోతుంటారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి పనికిరాని డబ్బా అని అనుకొని అందులో పెట్టిన విలువైన వస్తువులను మర్చిపోయి వాటిని చెత్తకుప్పల్లో పడేస్తూ ఉంటాం. కానీ అది గుర్తు వచ్చిన తర్వాత మాత్రం షాక్ అవ్వాల్సిందే. కానీ ఏం చేస్తాం ఆ తర్వాత చెత్తకుప్పలో పడేసిన డబ్బా మనకు దొరకదు కదా. ఇంకేముంది విలువైన వస్తువులన్ని  పోయినట్లే కదా. ఇక్కడ ఇలాంటిదే జరిగింది పాత  డబ్బా పనికిరాని డబ్బా అని చెత్తకుప్పలో పడేశారు. కానీ  ఆ తర్వాత దాంట్లో ఏముందో చూసి షాక్ కి గురయ్యారు. ఇంతకీ అందులో ఏముంది అంటారా అది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే మరి. చెత్త కుప్పలు భారీ నగదు పట్టుబడిన ఘటన లండన్ లో  చోటుచేసుకుంది. 

 

 

 లండన్ లోని బర్న్ హమ్  లో ఆన్ సీ   ప్రాంతంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. పనికిరాని అట్టపెట్టెలు అనే చెత్త కుప్పలు పారేసారు. అయితే రీసైక్లింగ్ సిబ్బంది ఆ చెత్త మొత్తం స్వీకరించిన తర్వాత ఆ చెత్తలో ఉన్న డబ్బాను తెరిచి చూస్తే అందులో కళ్లుచెదిరేంత  డబ్బు కనిపించింది. ఇటీవల ఓ వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి ఇంటిని పరిశుభ్రంగా పరిచేందుకు అతని బంధువులు అతని  ఇంటికి వచ్చారు. వారికి రెండు పాత అట్టపెట్టెలు కనిపించాయి. అయితే ఈ అట్టపెట్టెలు పాతవే అనుకొని ఇందులో ఏముండదు అనుకొని వాటిని బయట పారేశారు. 

 

 

 బయట పారవేసిన చెత్తను రీసైక్లింగ్ సిబ్బంది తీసుకెళ్లి తెరిచి చూస్తే దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ అట్టపెట్టెలో ఏకంగా  14 లక్షల వరకు నగదు ఉండడం చూసి ఖంగు తిన్నారు రీసైక్లింగ్ సిబ్బంది. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తి యొక్క బంధువులను గుర్తించారు. ఇక వారికి సమాచారం అందించి ఆ నగదు పెట్టెలను వారికి అందించారు పోలీసులు. తాము ఈ అట్టపెట్టెలను పనికిరాని వాడిగా భావించి పారవేశామని బంధువులు తెలిపారు. తమ బంధువు  డబ్బులు ఆ పెట్టెలో దాచి ఉంటాడు అన్న విషయం ఇప్పుడే తెలిసింది అంటూ బంధువులు ఇద్దరు సంతోషం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: