ఆమధ్య వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమిత్ షాకు లెటర్ రాశాడు గుర్తుందా.. హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారిని నియమించవద్దంటూ ఆ లేఖలో విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశాడు. ఈ పోస్టులో తనకు అనుకూలమైన వారిని రప్పించుకుని జగన్ ను ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విజయసాయిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

 

ఆ లేఖలో విజయసాయిరెడ్డి ఏం రాశారంటే.. సీబీఐ జేడీగా హెచ్.వెంకటేష్ అనే అధికారి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. సదరు హెచ్.వెంకటేష్ అనే అధికారి చంద్రబాబు ఏం చెబితే అది చేస్తారు అని ఆరోపించారు. అంతే కాదు.. ఆ వెంకటేశ్ సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ మాట వింటారని.. సదరు జేడీకి చంద్రబాబుకూ, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకూ లింకులున్నాయని ఉత్తరంలో రాశారు. గతంలో ఎస్పీగా ఉన్నప్పుడు.. జగన్ అక్రమాస్తుల కేసును విచారించారు. ఈ కారణంగానే.. విజయసాయిరెడ్డి మళ్లీ ఆ అధికారి జేడీగా రాకూడదని కోరుకున్నారు. లేఖ సాక్షిగా సీబీఐలో చంద్రబాబు పెత్తనం ఏ రేంజ్ లో ఉందో బహిర్గతమైంది.

 

అయితే ఇప్పుడు ఆ విజయసాయిరెడ్డి విజ్ఞప్తిని అమిత్ షా మన్నించాడు. లేఖ అందుకున్నప్పుడే దీన్ని సిబ్బంది వ్యవహారాల శాఖకు పంపుతానని ఎక్ నాలెడ్జ్ చేసిన అమిత్ షా ఆ పని అయ్యేలా చూశారు. తాజాగా హైదరాబాద్ సీబీఐ జేడీగా.. గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధరన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సో.. జగన్ పై సీబీఐ ద్వారా కక్ష తీర్చుకోవాలన్న చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలకు బ్రేక్ పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరి కొత్తగా ఈ పదవిలోకి వచ్చిన మనోజ్ శశిధరన్ గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం. ఈ మనోజ్ శశిధరన్ కేరళకు చెందిన వ్యక్తి. ఐపీఎస్‌గా గుజరాత్ కేడర్‌లో ఎప్పటి నుంచో పని చేస్తున్నారు. అమిత్ షా, నరేంద్రమోడీలకు అత్యంత సన్నిహిత అధికారిగా ఈయనకు పేరుంది. ఇప్పుడు వారి ప్రత్యేక శ్రద్ధ మేరకే గుజరాత్ నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ సీబీఐ జేడీగా వస్తున్నారు. మనోజ్ శశిధరన్ ఈ పదవిలో ఐదేళ్ల ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: