అదేంటి.. టీడీపీ నాయకుల గ్రామాలేంటి.. జగన్ కు జై కొట్టడమేంటనుకుంటున్నారా.. అవును.. ఇది అక్షరాలా నిజమంటున్నారు వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఏకంగా మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గంతో పాటు మిగిలిన నాయకుల గ్రామాల నుంచి కూడా జగన్ కు జై అంటూ తీర్మానాలు వస్తున్నాయట.



ఈ తీర్మానాలు ఏంటంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి 100 శాతం ఇంగ్లీష్ మీడియం చేస్తున్నారు కదా. దానికి సంబంధించి. జగన్ తీసుకున్న నిర్ణయం భేష్ అంటూ.. కుప్పంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అభినందన తీర్మానాలు వచ్చాయట.



టీడీపీ దిగ్గజ నేతలు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, అశోక్‌ గజపతిరాజు.. ఇలా టీడీపీ నాయకుల అందరి సొంత గ్రామాల నుంచి వంద శాతం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే తీర్మానాలు వచ్చాయన్నారు. ఒక అంశంపై ఇంత పెద్ద ఎత్తున ప్రజలు స్పందించడం దేశ చరిత్రలోనే ఇది మొదటిదన్నారు.



ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇచ్చిన రెఫరండంగా భావిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ దూరదృష్టితో ఆలోచించి లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ అందించాలని ఇంగ్లిష్‌ మీడియం బోధన విధానాన్ని తీసుకువచ్చారన్నారు. దీనిపై ప్రతిపక్షాలు వితండవాదాలు చేశాయని, మరికొన్ని పత్రికలు వక్రీకరిస్తూ రాశాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: