జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు మెరుగైన విద్య అందులో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పేద విద్యార్థులు అందరికీ మెరుగైన భోజనం మెరుగైన విద్య.. మెరుగైన వసతులు అందేలా చర్యలు చేపడుతుంది. పేద విద్యార్థులు అందరూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తోంది. కానీ కొంత మంది ఉపాధ్యాయుల తీరుతో ఏపీ ప్రభుత్వం లక్ష్యానికి తూట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు  కాస్త... పాఠశాలకు వచ్చి  టైం పాస్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆరోపణలు రావడంతో సర్కార్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పై ప్రత్యేక దృష్టి పెట్టింది. 

 


 అయితే ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు ఇదే చేస్తారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పాఠాలు బోధించి ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన మరిచి.... పాఠశాల సమయాన్ని మొత్తం సెల్ఫోన్లో కబుర్లు చెప్పుకుందేందుకు  వెచ్చించడం... వాట్సాప్ లో మెసేజ్ లు చేస్తూ కాలయాపన చేయడం.. విద్యార్థులకు పాఠాలు  చెప్పకపోవడం లాంటివి చేస్తారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. అయితే పలుమార్లు ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖకు ఆ ఇద్దరు ఉపాధ్యాయుల పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారి పై దృష్టిసారించిన విద్యాశాఖ... ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది. 

 


 కృష్ణాజిల్లా పెడన లోని బట్ట జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. విద్యార్థులకు పాఠాలు బోధించే కుండా కాలయాపన చేస్తూ అదేపనిగా సెల్ ఫోన్లో మాట్లాడుతున్న ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ శనివారం రిజిస్టర్ పోస్టు ద్వారా ఉపాధ్యాయులకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. జెడ్పీ పాఠశాలలో పనిచేసే కొలుకుల హనుమంతరావు అద్దంకి అశోక్ కుమార్ అనే ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు విద్యార్థులకు పాఠాలు చెప్పడం మాని ఎక్కువగా సెల్ఫోన్ యూస్  చేస్తూ మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ సమయం గడిపారు. కాగా ఈ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్ తో రాష్ట్రంలోని పలు పాఠశాలలో కూడా ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. కాగా వారికీ కూడా  హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: