ప్రపంచ రారాజు గా పృ పొందిన అమెరికాకు అధ్యక్షుడు అంటే మామూలు విషయం కాదు. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికి వీవీఐపీ. అటువంటి అమెరికా అధ్యక్షుడు భారత దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. దీనికోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. రెండు రోజులు పాటు ట్రంపు పర్యటనకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న స్నేహపూరిత వాతావరణాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు మోతెర స్టేడియం సర్వాంగ సుందరంగా లన్కరించుకుంది. తాజ్మహల్ పాలరాతి అందాలను ట్రంప్ ఆస్వాదించడానికి ఆగ్రా నగరం ఆహ్వానం పలుకుతోంది.

 

 భారత్ కు సంబంధించి ఎన్నో విషయాలను చర్చించేందుకు ఢిల్లీ నగరం సిద్ధంగా ఎదురుచూస్తోంది. సోమ, మంగళవారాల్లో భారత్ అమెరికా అధ్యక్షుడు విజయవంతం చేసేందుకు అధికారులు నాయకులు గట్టిగానే కష్టపడుతున్నారు. ఇప్పటికే ట్రంపు తో కరచాలనం చేసేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆహ్వానం అందాయి. కొంతమందికి ఊహించని విధంగా ఆహ్వానం అందింది. దాంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. కొంతకాలంగా కేంద్ర అధికార పార్టీతో విభేదిస్తూ వస్తున్న కెసిఆర్ ను కుడా ట్రంప్ ని కలిసేందుకు కేంద్రం ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. 


ఇదిలా ఉంటే ట్రంప్ ని కలిసేందుకు సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో  డోనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాత్రి 8 గంటలకు సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. అక్కడే అతిథులంతా కలిసి విందు ఆరగించబోతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి చార్మినార్ ప్రతిమతో కూడిన జ్ఞాపికను, పోచంపల్లి శాలువాను అందజేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్  సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకా లకు పోచంపల్లి, గద్వాల పట్టు చీరలను బహుకరించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: