చైనా దేశంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలకు శరవేగంగా వ్యాప్తిచెందిన విషయం తెలిసిందే. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం ప్రపంచ దేశాలలో విజృంభిస్తోంది. ఇప్పటికే 90 దేశాలకు పైగా ఈ కరోనా  వ్యాప్తి చెందింది. ఈ క్రమంలోనే ఈ ప్రాణాంతకమైన వైరస్ భారత్ కి కూడా వ్యాపించి ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్లో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు ప్రాణ భయంతో చిగురుటాకులా వణికిపోతున్నారు. ఎక్కడ తమకు కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రాణభయంతో నే బతుకుతున్నారు.

 

 

 అయితే కరోనా  దరి చేరకుండా ఉండేందుకు ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ప్రజలకు పలు సూచనలు చేశారు. యోగా చేస్తే కరోనా వైరస్  దరిచేరదు అంటూ తెలిపారు. నిన్న మీడియాతో మాట్లాడిన రాందేవ్ బాబా... ప్రజలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. యోగా చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందుతుందని తెలిపిన ఆయన... తద్వారా కరోనా వైరస్ భారిన పడకుండా ఉండొచ్చు  అంటూ తెలిపారు. ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అని తెలిపిన రాందేవ్ బాబా ఎవరికి వారు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యాధికి నివారణ చర్యలు ఒక్కటే మార్గం అంటూ తెలిపారు. మాస్కులు శానిటైసర్లు వాడటంతో పాటు ఇతరుల నుంచి నాలుగైదు అడుగుల దూరంలో ఉంటే మంచిది అంటూ సూచించారు. 

 

 

 ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని... ఇలా చేయడం ద్వారా కరోనా వైరస్ దరిచేరదు అంటూ చెప్పుకొచ్చారు. ఒక వేళ కరోనా  వైరస్ సోకిన రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ ను  తట్టుకునే శక్తి ఉంటుంది అంటూ తెలిపారు. ముఖ్యంగా గుండె జబ్బులు మధుమేహంతో బాధపడే వారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని... వారందరూ సహజ జీవన శైలిని అనుసరించాలని యోగా గురు బాబా రాందేవ్  కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: