ఇప్ప‌టికే తెలుగు మీడియా రంగంలో ఛానెల్స్ పుంకాను పుంకాలుగా ఉన్నాయి. చాలా ఛానెల్స్ తీవ్ర న‌ష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉన్న ఛానెల్స్ సైతం ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయ‌క త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక ఇప్పుడు వీటికి తోడు మ‌రో స‌రికొత్త ఛానెల్ పుట్టుకు వ‌స్తోంది. తెలుగులో ఇప్ప‌టికే యూ ట్యూబ్ ఛానెల్స్ కూడా పుట్ట‌గొడుగుల్లా పుట్టుకు వ‌చ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు వ‌చ్చే ఛానెల్ ఓ జాతీయ ఛానెల్ కావ‌డం విశేషం. ఇప్ప‌టికే ఏబీపీ పేరుతో హిందీ చాన‌ల్ న‌డుపుతున్న ఏబీపీ నెట్‌వ‌ర్క్ తెలుగు మార్కెట్‌పై క‌న్నేసింది. ఏబీపీ నెట్‌వ‌ర్క్ కింద మ‌రాఠీ, బెంగాలీ, గుజ‌రాతీ, పంజాబీ, ఉత్త‌ర‌ప్రదేశ్ కోసం ఓ ఛానెల్ ప్ర‌త్యేకంగా ఉన్నాయి.

 

ఇప్ప‌టి వ‌ర‌కు ఏబీపీ నెట్ వ‌ర్క్ కింద మొత్తం ఆరు ఛానెల్స్ ఉన్నాయి. ఈ నెట్ వ‌ర్క్‌ను మ‌రింత‌గా విస్త‌రించే ప‌నిలో ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు తెలుగు మార్కెట్ టార్గెట్ చేస్తూ ఏపీ, తెలంగాణ‌కు క‌లిపి ఓ న్యూస్ ఛానెల్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక ఈ నెట్ వ‌ర్క్ విస్త‌ర‌ణ‌లో భాగంగా ఏబీపీ  కొత్తగా నాలుగు చానెళ్ల లైసెన్స్ తీసుకుంది. ఏబీపీ ఆంధ్ర‌, ఏబీపీ గంగా, ఏబీపీ క‌న్న‌డ‌, ఏబీపీ త‌మిళ్ పేరుతో లైసెన్స్‌, శాటిలైట్ సిగ్న‌ల్స్ పొందింది. వీటిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్ కోసం డిజైన్ చేసిన ఏబీపీ గంగా ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది.

 

ఇక సౌత్ మార్కెట్‌పై క‌న్నేసిన ఈ ఛానెల్ ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలోనే ఇక్క‌డ అడుగు పెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక ఇప్పుడు స‌రైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన వ్య‌క్తిని తెలుగు ఛానెల్ హెడ్‌గా పెట్టాల‌ని చూస్తోంది. ఇందుకు అన్వేష‌ణ కూడా ప్రారంభ‌మైంద‌ట‌. ఇక ఛానెల్ హెడ్ కోసం ఇప్ప‌టికే 10 మందిని షార్ట్ చేసి వీరిలో ఫైన‌ల్‌గా న‌లుగురిని ఎంపిక చేసింద‌ని టాక్‌. ఇక సిబ్బంది నియామ‌కం సైతం ప్రారంభ మైన‌ట్టు గుస‌గుస‌లు మీడియా స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

 

ఇప్ప‌టికే తెలుగు న్యూస్ ఛానెల్స్ పార్టీలు, కులాల వారీగా విడిపోయిన నేప‌థ్యంలో మ‌రి ఈ కొత్త ఛానెల్ నిష్ప‌క్ష‌పాతంగా ప‌ని చేస్తుందా ?  లేదా ?  త‌న మ‌నుగ‌డ కోసం ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతుందా ? అన్న‌ది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: