తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా రోగులకు సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు ఏపీ సర్కారు మీడియాకు అందిస్తోంది. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. కరోనా వైరస్‌ రోగి వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని, గోప్యత కలిగిన సమాచారం వెల్లడించడం నిషేధమని జగన్ సర్కారు చెబుతోంది. ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటాని వార్నింగ్ ఇచ్చింది.

 

 

నిబంధనలకు విరుద్ధంగా కరోనా వైరస్‌ రోగి వివరాలు, వైద్య పరీక్షల వివరాలు వెల్లడిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం ఘాటుగా హెచ్చరించింది. ఇటీవలి కాలంలో కరోనా గురించి సోషల్ మీడియాల్లో జోరుగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వారు ఈ విషయం గమనించాలి లేకపోతే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. సాధరణంగా ఇలాంటి సమాచారం సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ఉంటోంది.

 

 

కరోనా రోగి వివరాలు బయటపెడితే వారిని మిగిలిన సమాజం బహిష్కృతులుగా చూస్తోంది. వారిని, వారి బంధువులను సమాజంలో కలుపుకునే పరిస్థితులు లేవు. అందుకే ఇకపై ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో పంపారు కదా అని కరోనా రోగులకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే ఇబ్బందుల్లో పడే ప్రమాదం చాలా ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి.

 

 

కరోనా కష్టకాలంలో సంయమనం పాటించడం చాలా అవసరం. ఖాళీ సమయం ఉంది కదా అని.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని కనిపించిన సమాచారం ఫార్వార్డ్ చేస్తూ పోతూ ఇబ్బందుల్లో పడతారు.. జాగ్రత్త.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: