కొరోనా వైరస్ వ్యాపించకుండా కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు తాజాగా మార్గ దర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. కొరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో భాగంగా జిల్లాల సరిహద్దులను కూడా మూసేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. నిజానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి దేశం మొత్తాన్ని లాక్ డౌన్ ప్రకటించిందే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు. అంతకుముందు జనతా కర్ఫ్యూ విధించిన కారణం కూడా ఇదే. అయితే ప్రధానమంత్రి పిలుపు అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.

 

ఎందుకంటే జనతా కర్ఫ్యూ స్పూర్తి చాలామందికి అర్ధం కాలేదు. అదే సమయంలో  లాక్ డౌన్ ప్రకటించిన సమయం కూడా సరైంది కాదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఎందుకంటే హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించేస్తే జనాలు తమ సొంతూర్లను వదిలిపెట్టి ఎకడెక్కడో తిరుగుతుంటారు. వాళ్ళంతా ఉన్న ప్రాంతాల నుండి తమ సొంతూర్లకు ఎలా వెళ్ళాలి ?  వెళ్ళే సౌకర్యాలు లేక, ఉన్న ప్రంతాల్లో ఉండే అవకాశాలు లేకే వేలాది మంది తమ సొంతూర్లకు గుంపులు గుంపులుగా బయలుదేరారు. ఇక్కడే చాలామంది మోడిని తప్పు పడుతున్నారు.

 

సరే కారణాలు ఏవైనా కానీండి లాక్ డౌన్ అంతగా సక్సెస్ కాకపోగా వైరస్ వ్యాప్తికి ఇది కూడా ఓ కారణమైంది. దాంతో కేంద్రానికి విషయం అర్ధమై ఇపుడు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇదే సమయంలో  లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాల్సిందే అంటూ రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం తాజగా వార్నింగులు ఇచ్చినట్లు సమాచారం. జిల్లాల సరిహద్దులు కూడా మూసేయాలని గట్టిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపిలకు వార్నింగులు ఇచ్చిందట.

 

లాక్ డౌన్ ప్రకటిచిన తర్వాత కూడా జనాలు రాకపోకలు పూర్తిగా ఆగిపోలేదని దీనివల్ల వైరస్ నియంత్రణ సాధ్యం కాదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. రాబోయే 14 రోజులు నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేస్తే ఫలితాలు అంత ఎక్కువగా వస్తాయన్నది కేంద్రం భావన. నిజానికి ఇందులో కేంద్రాన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోతే చివరకు మరణమే శరణ్యమని సాగిలపడాల్సుంటుంది. ఇపుడు ఇటలీ, స్పైన్ లో జరుగుతున్నదిదే. అందుకనే తాజాగా కేంద్రం గట్టి వార్నింగులిచ్చిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: