కరోనా వైరస్ దెబ్బకు పెద్దన్న అమెరికా చేతులెత్తేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా పిలవబడిన అమెరికా ఆర్ధిక వ్యవస్థ కరోనా కారణంగా.. నేడు.. చతికలపడింది. ఇక ఆదేశ అధ్యక్షుడు ట్రంప్ కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని కొన్ని ఆంగ్ల మీడియాలు చెబుతున్న విషయం తెలిసినదే. ఏది ఏమైనా... ప్రస్తుతం ఇంచుమించుగా.. 2 లక్షల కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అమెరికా ప్రజలు విలవిలలాడుతున్నారు. 

 

ఇక అక్కడ చిక్కుకున్న మనవారు కాపాడమని... ఇండియాకు తీసుకెళ్లమని, మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అడుగుతున్న అభ్యర్ధనలు మనం చూస్తూనే వున్నాం. కానీ ప్రస్తుత మన ఇరు రాష్ట్రాల... పరిస్థితి చుస్తే ఇక్కడ గడ్డుకాలం గడుస్తోంది. ఇక వారిని ఇండియాకు రప్పించడం అనేది కలలానే అనిపిస్తోంది. ఎందుకంటే, ఇక్కడ నమోదైన కేసులు ఇంచుమించుగా.... ఇతర దేశాల నుండి వచ్చినవారే కావడం గమనార్హం.

 

ఇక అమెరికా కరోనా మరణాల రేటు మనం గమనించినట్లయితే.... 5 వేలకు చేరువలో వుంది.... ప్రస్తుత కేసులు గమనించినట్లయితే... 198592కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య.... 4450కు చేరుకొంది. 7251 మంది కరోనా కోరల్లోనుండి బయట పడినట్లు తెలుస్తోంది. అలాగే... ప్రమాదపు అంచుల్లో వున్న కేసులు 4576 తెలుస్తోంది...

 

ఇకపోతే, కాసేపటి క్రితమే.. అమెరికా యుద్ధ నౌక థియోడ‌ర్ రూజ్‌వెల్ట్ లో 4,000 మంది చిక్కుకున్నట్లు, అందులో సుమారుగా... 100 మంది సిబ్బందికి, ప్యాసింజర్లకు క‌రోనా నిర్ధారణ అయినట్లు సమాచారం. వారి వల్ల మిగతా 3,900 కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో వారు తీవ్రమైన భయానికి గురౌతున్నట్లుగా తెలుస్తోంది... ఈ మేరకు త‌మ‌ను వెంటనే.... కాపాడాలంటూ దేశ అధ్యక్షుడు ట్రంప్ ను వేడుకుంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: