దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి ఎంత చేస్తున్నా... లాక్ డౌన్ విధించినా.. ఈ కరోనా మహమ్మారిని మాత్రం అరికట్టలేని పరిస్థితి నెలకొంది.  తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.   ఏపిలో మాత్రం రోజు రోజుకీ ఈ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా కష్టకాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చూస్తోందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న ఆయన, కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం కొంత ఊరటనిచ్చే విషయం అన్నారు. ఇక రేషన్‌ కార్డుదారులకు శనివారం నుంచి రూ. 1000 అందజేస్తామని.. మరికొన్ని రోజులు ఓపిక పడితే కరోనా కష్టాలు తొలగిపోతాయని.. అప్పటి వరకు లాక్ డౌన్ ని సీరియస్ గా పాటించాలని కోరారు.  

 

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. అయితే ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులన్ని ఢిల్లీ మర్కజ్కి వెళ్లి వచ్చిన వాళ్లవేనని, ఇంకా ఎవరైనా ఢిల్లీ వెళ్లివచ్చిన వాళ్ళు ఉంటే స్వచ్ఛదంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి బాలినేని విజ్ఞప్తి చేశారు. కరోనాని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉందని.. ఢిల్లీకి వెళ్లి వచ్చానవారు.. వారి మీటింగ్స్ లో పాల్గొన్న వారు వెంటనే ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటే వారికి.. సమాజానికి కూడా మంచిదని అన్నారు.

 

 

అదేవిధంగా నిత్యావసర సరుకులు అధిక రేట్లకు అమ్ముతున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని బాలినేని మరోసారి హెచ్చరించారు. సీఎం జగన్‌ ముందు చూపుతో వాలంటీర్ల వ్యవస్థ అమలు చేశారని, కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో వారే కీలకంగా మారారన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: