ఏపీలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 226కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 23 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 23 కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 27కు చేరింది. జిల్లాలో భారీగా కరోనా కేసుల సంఖ్య పెరగడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
రాష్ట్రంలో పలు జిల్లాల్లో కరోనా విజృంభించినా కర్నూలు జిల్లాలో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. తొలుత జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామంలో రాజస్థాన్ కు చెందిన యువకుడు కరోనా భారీన పడినట్లు అధికారులు గుర్తించారు. నిన్న మర్కజ్ కు వెళ్లి వచ్చిన ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. ఈరోజు 23 కేసులు నమోదు కావడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 23 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
 
ఈరోజు నమోదైన కేసులకు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు సంబంధం ఉందని తెలుస్తోంది. జిల్లాలో భారీగా కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తుల కుటుంబ సభ్యులను, సన్నిహితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎవరిలోనైనా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వారి నమూనాలను సేకరించి ల్యాబ్ లకు పంపిస్తున్నారు. 
 
మరోవైపు ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. కొత్త కేసులు నమోదు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. గ్రామ, వార్డ్ వాలంటీర్లు, ఆశా వర్కర్ల సహాయంతో సర్వేలు నిర్వహించి ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి వైద్య చికిత్స అందే విధంగా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: