దేశంలో కరోనా వైరస్ ప్రబలి పోతుంది.. దాంతో గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.    రోడ్లపై జన సంచారం పూర్తిగా బంద్ అయ్యింది. దాంతో అడవిలో ఉండే పక్షులు.. జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. దారుణం ఏంటేంటే కొన్ని కృర మృగాలు కూడా యదేచ్చగా తిరుగుతున్నాయి. జనసంచారం లేకపోవడంతో శేషాచల అడవుల నుంచి వస్తున్న వన్యమృగాలు తిరుమల వీధుల్లో దర్శనమిస్తున్నాయి.

 

తాజాగా, తిరుమల రహదారిపై రెండు ఎలుగుబంట్లు కనిపించాయి. ఇటీవలే కొన్ని చిరుతలు కూడా తిరుమలలోని నారాయణగిరి గెస్ట్ హౌస్ వద్ద కనిపించాయి. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారికి నిత్య కైంకర్యాలు తప్ప మరేమీ జరగడంలేదు. తిరుమల రహదారిపై రెండు ఎలుగుబంట్లు కనిపించాయి. అవి రోడ్డు దాటుతుండగా వీడియో తీశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ఆ వీడియోను షేర్ చేశారు.  ఈ రోడ్లపై అప్పడప్పుడు పులులు ఇతర జంతువులు కూడా సంచరిస్తుంటాయని అంటారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: