ఏపీలో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా టెస్టుల సంఖ్యని పెంచడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్లని కొనుగోలు చేసింది. అయితే ఈ కొనుగోలులో అక్రమాలు జరిగాయని, జగన్ ప్రభుత్వం కమిషన్ కొట్టేసిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపణలు గుప్పించారు. ఇక దీనికి కౌంటర్ గా ప్రభుత్వం పలు వివరణలు కూడా ఇచ్చింది.

 

ఈ క్రమంలోనే కన్నా చేసిన ఆరోపణలకు, వైసీపీ ఎంపీ విజయసాయి కౌంటర్ గా, చంద్రబాబుకు కన్నా 20 కోట్లకు అమ్ముడుబోయారని ఆరోపించారు. దీంతో కన్నా కూడా ఫైర్ అయ్యి, దేవుడు దగ్గర ప్రమాణం చేద్దామని సవాల్ విసిరారు. అటు విజయసాయి కూడా దీనికి కౌంటర్ ఇచ్చేసారు.అయితే ఈ ర్యాపిడ్ కిట్ల రగడ కాస్త సద్దుమణుగుతుందనే టైంకి కన్నా, మళ్ళీ దానిపై రచ్చ చేయడం మొదలు పెట్టారు. కిట్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వం కమిషన్ తీసుకుని, రాష్ట్ర ఖజానాకు ఆర్ధిక నష్టం తెచ్చారని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ కు లేఖ రాసారు. పనిలో పనిగా విజయసాయి తన పరువుకు భంగం కల్గించారని కూడా చెప్పారు.

 

ఇక ఇక్కడ వరకు కన్నా రాజకీయంగా బాగానే బండి నడిపించారు. కానీ గవర్నర్ కు లేఖ రాసే బదులు కేంద్ర ప్రభుత్వానికే లేఖ రాసుంటే బాగుండేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కేంద్రంలో ఎలాగో వారి ప్రభుత్వమే ఉంది కాబట్టి, ఏమన్నా అవకతవకలు జరిగే ఉండే చర్యలు తీసుకునేవారని అంటున్నారు. అయితే కన్నా ఆ పని చేయలేరని చెబుతున్నారు.

 

ఎందుకంటే ఐసీఎంఆర్‌ (భారత వైద్య పరిశోన మండలి) ఒక్కో కిట్‌ను రూ.795కు కొనుగోలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.730కే కొనుగోలు చేసింది. అలాగే దేశంలో తాము కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ ధరకు ఏ రాష్ట్రానికైనా విక్రయిస్తే.. అదే ధరను తమకూ వర్తింపజేయాలని కొనుగోలు ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం షరతు కూడా పెట్టింది. మరి ఈ విధంగా పకడ్బందీగా కొనుగోలు జరిగినప్పుడు కన్నా కేంద్రానికి లేఖ రాయలేరని, పైగా కేంద్రమే ఎక్కువ రేటు పెట్టింది. కాబట్టి ఏదో రాష్ట్రంలో రాజకీయ లబ్ది పొందాలని కన్నా ఈ లేఖస్త్రాలు సంధిస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: