లాక్ డౌన్  నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు అన్నీ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్లాక్ లో మందు  తీసుకోవాలన్న మద్యం దొరకని పరిస్థితి. ఇక ఈ క్రమంలోనే మందుబాబుల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. రోజు హాయిగా ఫుల్లుగా తాగి కిక్కులో  ఉండే మందుబాబులు నెల రోజులకు పైగా మద్యం దొరక్కపోవడంతో అయోమయంలో పడిపోయారు. దీంతో మద్యం కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ మద్యం దొరకని పరిస్థితి. దీంతో కొంతమంది నాటుసారా తో సరిపెట్టుకుంటున్నారు. కొంతమంది కళ్ళు తో  కాలం గడిపేస్తున్నారు. ఈ  నేపథ్యంలోనే ఒక అక్రమ దందాకు తెరలేపుతున్నారు కొంత మంది అక్రమార్కులు. 

 

 

 ఎలాగోలా లాక్ డౌన్  సమయం.. ఎవరికి మందు దొరకదు... ఇప్పుడు ఎంత ధరకు అమ్మినా కొంటారు అని భావించి అక్రమంగా మద్యం విక్రయించడం లాంటివి  చేస్తున్నారు. అంతేకాకుండా వెయ్యి రూపాయలు ఉన్న మద్యం బాటిల్ ను 5000,  6000 రూపాయలకు అమ్ముతూ  బాగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇక నగరాల్లో అయితే పరిస్థితి మరీ దారుణం కళ్ళు దొరకడం లేదు  సారా దొరకడం లేదు మందు దొరకడం లేదు. ఒకవేళ పల్లెలకు వెళ్దామంటే పోలీసులు వెళ్లనివ్వడం  లేదు. వాహనాలు అక్రమంగా మద్యం తీసుకెళ్ళాలి  అంటే అలా కూడా కుదరడం లేదు. దీంతో మందుబాబులు రూటు మార్చారు. సొంత వాహనాల ద్వారా మద్యం తీసుకు వెళితే కేసులు నమోదవుతాయి.  కాబట్టి అంబులెన్సులను  ఆశ్రయిస్తున్నారు. 

 

 

 అత్యవసర సేవల కోసం ఉపయోగించే అంబులెన్సులను ఆల్కహాల్ కళ్ళు రవాణాకు ఉపయోగిస్తున్నారు అక్రమార్కులు. ఇక అంబులెన్సులను ఎక్కడ ఏ చెక్పోస్ట్ దగ్గర పోలీసులు ఆపరు అనేది ధీమాతో... అక్రమంగా యథేచ్ఛగా అంబులెన్స్ ద్వారా అక్రమ మద్యం కల్లు రవాణా  చేసేస్తున్నారు. ఇక అంబులెన్స్ ను  ఎవరూ ఆపలేరు అన్న  ధీమాతో చౌటుప్పల్ నుంచి 40 లీటర్ల కల్లును హైదరాబాద్ తరలిస్తుండగా బల్కంపేట్ చెక్పోస్ట్ వద్ద పోలీసులకు దొరికిపోయారు. వారి వద్ద నుంచి 40 లీటర్ల కళ్ళు ను  స్వాధీనం చేసుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న బాలకృష్ణ గణేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అంబులెన్సులు కళ్ళు తరలించడం చూసి పోలీసులు కూడా షాక్ కి గురయ్యారు దీంతో తనిఖీలు ముమ్మరం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: