దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికే 42 వేల వరకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. రోజురోజుకు కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 24వ తేదీ నుంచి లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు దఫాలుగా లాక్ డౌన్ పెంచారు. ఈ నేపథ్యంలో మే 17వ తేదీ వరకు ఈ నిబంధనలు మోదీ పొడిగించారు. అయితే సుదీర్ఘకాలం లాక్ డౌన్ కొనసాగించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలగడంతో పాటు వలస కూలీలు తదితరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో కేంద్రం గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్ ల కింద కరోనా కేసుల సంఖ్య ను బట్టి మూడు ప్రాంతాలుగా విభజించింది. అంతేకాదు గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో యధావిధిగా ప్రజలు కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా నిబంధనలను సడలించింది. దీనిలో భాగంగానే ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 
 
 
ఇక మద్యం షాపులు కూడా తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే కేంద్రం విధించిన నిబంధనలపై ఆయా రాష్ట్రాల దే అంతిమ నిర్ణయమని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోమవారం వివిధ రాష్ట్రాల్లో మద్యం షాపులను యధావిధిగా చేర్చారు. అయితే మద్యం షాపులు తెరవడం వల్ల భారీ ఎత్తున జనాలు గుమిగూడడం, సామాజిక దూరం పాటించకపోవడం, శాంతిభద్రతలకు విఘాతం కలగడం ఇలా ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని కేంద్రం గ్రహించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే విధంగా కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. 
 
 
ప్రస్తుతం మే 17వ తేదీతో నిబంధనలు ఎత్తివేసే అవకాశం ఉన్నట్టు అంతా భావిస్తున్నారు. అయినా పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ నిబంధనలు జూన్ ఒకటో తేదీ వరకు పొడిగిస్తే పరిస్థితులు ఎలా ఉంటుందో అన్న విషయంపై ప్రధాని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రిమండలిలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రధాన  ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా లాక్ డౌన్ పొడిగింపుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని చూస్తున్నారట.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: