ఎందుకు పుట్టిందో ఎలా పుట్టిందో తెలియదు కానీ, కరోనా వైరస్ మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. అంతకు ముందు ఎప్పుడూ చూడని ఈ పెను విపత్తు కారణంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇబ్బంది పడుతున్న వారే తప్ప ఏ ఇబ్బందులు ఎదుర్కోని వారు ఎవరూ కనిపించడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు విధించారు. అలా విధించిన లాక్ డౌన్ అప్పుడే ఒక నెల పూర్తి చేసుకుని రెండో నెల జరిగిపోతుంది. ఈ కరోనా ఎఫెక్ట్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. మరి ఎంతోమంది జీవితాలు అతలాకుతలం చేశాయి. ఫ్యాక్టరీలు, షాపులు, వృత్తి పని ఇలా అన్నిటికీ బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వరంగ సంస్థలు కూడా ఈ ఎఫెక్ట్ కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. 

IHG's Lock down Typography <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POSTERS' target='_blank' title='poster-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>poster</a> Design by Swapnal Jain on Dribbble


ఇక ప్రైవేటు రంగం విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతో ఇంతో ఎంతోకొంత ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి యాజమాన్యాలు జీతాలు చెల్లించాలి. ఏ వ్యాపారం చేయకపోయినా, తమపై ఆధారపడిన ఉద్యోగులు వారి కుటుంబాల గురించి ఆలోచించినా, కనీసం సగం జీతమైనా చెల్లించాల్సిన పరిస్థితి యాజమాన్యాలకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపారాలు జరగకపోవడంతో సొమ్ములకు కటకటలాడిల్సిన పరిస్థితి అందరికి ఎదురవుతోంది. బ్యాంకులో రుణాలు తీసుకుని జీతాలు చెల్లిద్దామంటే అది ఇప్పట్లో జరిగే పని కాదు. ఆర్థికంగా స్థితిమంతులు కూడా ఈ ఎఫెక్ట్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

 

IHG

 లాక్ డౌన్ పూర్తయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే పరిస్థితి లేకపోవడంతో ఎవరూ అప్పులు ఇచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ప్రైవేటు రంగానికి భరోసా కల్పిస్తూ, బ్యాంకింగ్ రంగమే వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే బ్యాంకింగ్ రంగం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది. చేసిన అప్పులపై మూడు వారాల వరకు మారటోరియం విధించడంతో బ్యాంకులు రికవరీ శాతం పూర్తిగా పడిపోయింది. 

 

ఈ పరిస్థితుల్లో కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. బ్యాంకులు పరిస్థితి ఈ విధంగా ఉండడంతో పారిశ్రామిక, ప్రైవేటు రంగాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి వస్తుందో రాదో చెప్పే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: