అయితే పాకిస్తాన్ దేశం ఎప్పుడెప్పుడు భారతదేశంపై దాడి చేసి భారతదేశంలో విధ్వంసం సృష్టించాల అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఏదోవిధంగా భారత్లోకి చొరబడి ఆ తర్వాత బాంబులు పేల్చడం..  కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించడం... లేదా ఇంకేదైనా విధ్వంసం సృష్టించడం లాంటివి చేస్తూ ఉండాలని ఉగ్రవాదులు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం కరోనా  టైంలో ఉగ్రవాదుల చర్యలు మరింతగా పెరిగిపోతున్నాయి . కరోనా వైరస్ సమయంలో ఎక్కువ కరోనా  వ్యాప్తి చెందేలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఇక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ అటు ఇండియన్ ఆర్మీ మాత్రం అన్నిటికీ తిప్పికొట్టింది. 

 

 ఇప్పటికే సొరంగాలను ఫెల్చేయడంతోపాటు సొరంగాల ద్వారా బయటకు వచ్చిన ఉగ్రవాదులను కాల్చి పడేసింది. శిబిరాలను  కూడా బాంబులు ద్వారా పేల్చేసింది భారత సైన్యం. అంతేకాకుండా అక్రమంగా లోపలికి చొరబడాలని ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను ఎక్కడికక్కడ మట్టు బెడుతుంది.ఇదిలా ఉంటే  భారత్లో ఉగ్రవాదుల ద్వారా కరోనా  వైరస్ వ్యాప్తి చెందేలా చేసి  భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సంక్షోభం లోకి వెళ్లి పోయిన తర్వాత విదేశీ కంపెనీల పెట్టుబడులకు తగ్గిన  తర్వాత నుంచి భారత్ చైనా  సహాయం కోరేలా చేయాలి అన్నది ఉగ్రవాదుల వ్యూహం. అయితే భారత్ మీద దాడులు చేసి కరోనా  వైరస్ వ్యాప్తి చెందేలా చేయడం దేవుడెరుగు ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాదులే  క్లిష్ట పరిస్థితుల్లో వచ్చి పడ్డారూ . 

 


 ఒకరిని నాశనం చేయాలి అనుకుంటే మన నాశనం తప్పదు  అన్న నానుడి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు కరోనా  వైరస్ సోకిన వారు అక్కడి ఉగ్రవాద శిబిరాల్లో ఉండడంతో.. అక్కడ శిబిరాల్లో  ఉన్న ఉగ్రవాదులు అందరూ కరోనా  వైరస్ బారిన పడ్డారు. ఏకంగా  320 మంది ఉగ్రవాదులు ఉన్నటువంటి ఒక శిబిరం లో సుమారు 240 మంది ఉగ్రవాదులకు కరోనా సోకిందట  . ఈ విషయాన్ని అక్కడి మీడియా కూడా చెబుతోంది. కాగా  ఉగ్రవాదులను హాస్పిటల్ చికిత్స అందించడానికి పాకిస్తాన్ కి తీసుకెళ్తే  ప్రపంచం మొత్తానికి ఆ విషయం తెలిసిపోతుంది. అటు భారత్ కూడా కరోనా  వైరస్ వ్యాప్తి చేయడానికి ఉగ్రవాదులకు కరోనా  అంటించి  పంపిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఉగ్రవాదుల పాపం పండినట్లు అయింది.కరోనా తో భారత్ ను నాశనం చేయాలనుకున్నారు... చివరికి ఉగ్రవాదుల పాపం పండింది..?

మరింత సమాచారం తెలుసుకోండి: