రెండో సారి భారీ స్థాయిలో గెలిచి అధికారంలోకి రావడమే కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు చేసి సంచలనం సృష్టించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఏ ప్రధాని చెయ్యని సాహసాన్ని మోడీ రద్దు చేసి కాశ్మీర్ ఇండియాలో భాగమని ప్రపంచ దేశాలకు చాటిచెప్పారు. కాశ్మీర్ భూభాగం కోసం గతంలో పాకిస్తాన్ ఇండియా దేశాల మధ్య అనేక వివాదాలు అంతర్జాతీయ స్థాయిలో జరిగాయి. అటువంటి అంశాన్ని మోడీ రెండోసారి గెలిచాక చాలా దూకుడుగా కాశ్మీర్ లో అమలవుతున్న ఆర్టికల్ 370 ని రద్దు చేసి భారత్ విధివిధానాలు అక్కడ అమలయ్యేందుకు చర్యలు చేపట్టడం నిజంగా గ్రేట్. కాశ్మీర్ లో  అంతకు ముందు ఉన్న చట్టాలను పూర్తిగా మారుస్తూ భారత దేశంలో అమలవుతున్న చట్టాలు అమలు అయ్యేలా కేంద్ర హోం శాఖ కీలక చర్యలు చేపడుతోంది.

 

ఇటువంటి సమయంలో పోలీసు వ్యవస్థలో కూడా మార్పులు తీసుకువచ్చారు. అంతకుముందు ఆర్టికల్ 370 అమలులో ఉన్న సమయంలో కాశ్మీర్ రాష్ట్రంలో ఇతరులు ఎవరు స్థిర నివాసం గాని, ఉద్యోగం గాని, ఆస్తులు కొనుగోలు చేయడం వంటివి ఉండేవి కాదు. అయితే తాజాగా మోడీ తీసుకున్న నిర్ణయం తో చాలామంది కాశ్మీర్ రాష్ట్రంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉద్యోగాలు కూడా చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. రెండోసారి అధికారంలో వచ్చిన మోడీ వేసిన స్కెచ్ తో ప్రస్తుతం  పర్యాటక ప్రాంతమైన కాశ్మీర్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా పుంజుకున్నట్లు సమాచారం.

 

గతంలో ఒక ఎకరా కేవలం లక్ష నుండి 5 లక్షల లోపు రేటు పలికేది. కానీ తాజాగా మోడీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆర్టికల్ 370 రద్దు అవటంతో కాశ్మీర్ లో ఎకరం రెండున్నర నుంచి మూడు కోట్ల మధ్య ధర పలుకుతున్నట్లు సమాచారం. మొత్తం మీద మోడీ తీసుకున్న నిర్ణయానికి కాశ్మీర్ రాష్ట్రంలో భూములకు మంచి డిమాండ్ పెరిగింది. పర్యాటక ప్రాంతం కావడంతో చాలామంది భూములు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: