టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా బాధ లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ ఆ బాధ కు సరైన కారణం కూడా చెప్పలేకపోతున్నారు. ఒకవైపు పార్టీ భవిష్యత్తు, మరోవైపు అధికార పార్టీని ఢీకొట్టే సామర్థ్యం రెండూ లేవని బాధపడుతూ, తన తర్వాత తన వారసుడిగా రాజకీయ చక్రం తిప్పాల్సిన లోకేష్ తనకు అక్కరకు రాకపోవడం, ఇవన్నీ చాలాకాలంగా చంద్రబాబును వేధిస్తున్న ప్రశ్నలు. పైకి ధైర్యంగా ఉన్నట్టుగా కనిపిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా డైలాగులు చెబుతూ వస్తున్న చంద్రబాబు కు మాత్రం ఇవన్నీ వేదన కలిగిస్తున్నాయట. అదీకాకుండా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన నాయకులు చాలామంది, అధికారం కోల్పోయిన తర్వాత కనీసం పార్టీ గురించి పట్టించుకోవడం లేదని, ఎవరికీ వారు తప్పించుకుని తిరుగుతున్నారు తప్ప అధికారపార్టీ తప్పిదాలను ఎత్తి చూపేందుకు, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, ఉద్యమాలు చేసేందుకు వెనకడుగు వేయడం, ఇవన్నీ బాబుకు అసహనం కలిగిస్తున్నాయి.

 

IHG


 తాను 70 సంవత్సరాల వయసులోనూ, అధికార పార్టీకి ఎదురు నిలబడుతుంటే టీడీపీ అధికారంలో ఉండగా ఆర్థికంగా బలపడిన వారు కూడా ఇప్పుడు పార్టీని పట్టించుకోకపోవడం, తమకు ఎందుకులే అని ధోరణితో ఉండడం వంటివి అసహనం పెంచుతున్నాయి. తాను 70 ఏళ్ల వయసులో ఉద్యమాలు ఆందోళనలు అంటూ విశ్రాంతి లేకుండా కష్టపడేది ఎవరికోసం అని ? పార్టీ భవిష్యత్తు గురించి ఒక్క నాయకుడు బాధ్యతగా వ్యవహరించడం లేదని, తాను మాత్రం అన్ని విషయాలను ఎలా చక్కబెట్టుకుని ముందుకు వెళ్లగలనని, టిడిపి కీలక నాయకులు కొంతమంది వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 

 


ఇప్పుడు కొంతమంది నాయకులు అధికార పార్టీ కేసులు పెడుతుందన్న భయంతో ఇంటికి పరిమితం అవడం, పార్టీ ఏ పిలుపు ఇచ్చినా, పట్టించుకోనట్టు గా వ్యవహరించడం వంటి సంగతులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే 2019 ఎన్నికల్లో పార్టీ సీటుపై పోటీ చేసిన చాలామంది నాయకులు అసలు ఇప్పుడు పార్టీలో ఉన్నారా ? లేరా అన్నట్టుగా వ్యవహరించడం, పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకపోవడం, పార్టీ కార్యక్రమాలు ఆందోళనలు ఉద్యమాలు నిర్వహించే సమయంలో ఖర్చు పెట్టేందుకు వెనకడుగు వేయడం, అన్ని పార్టీ భరిస్తుంది అన్నట్లు గా వ్యవహరించడం, ఇవన్నీ బాబులో అసంతృప్తిని పెంచుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: