ఈ మద్య మనిషి ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు తన సంపాదన గురించిన ఆలోచనే చేస్తున్నారు.  ఉద్యోగులు నెల సరి జీతం కోసం.. వ్యాపారస్తులు తమ వ్యాపారాభివృద్ది కోసం.. ఏ పనైనా డబ్బు కోసమే అన్న విషయం తెలిసిందే.  సంఘంలో బతకాలంటే డబ్బు అవసరం ఎంతైన ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో కరోనా మహమ్మారి వచ్చి ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం చేసింది. ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్డు పాలయ్యారు.. వ్యాపారులు కోట్లు నష్టపోయారు. ఇక వలస కూలీల పరిస్థితి అయితే అగమ్యగోచరంగా తయారైంది. దేశంలో లాక్ డౌన్ కారణంగా చిరు వ్యాపారుల, చిరు ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు.  ఈ సమయంలో కొంత మంది తమ మంచి మనసు, దాతృత్వాన్ని చాటుకున్నారు.

 

 సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల వారు పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. దేశంలో కరోనా మరింత విజృంభిస్తుంది.. ఈ సమయంలో ప్రజలు బయట స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిలో ఉన్నారు.  ఎంతో మంది ఆకలితో అలమటించి పోతున్న సమయంలో కొందరు యువకులు అండగా నిలిచారు. కేవలం ఒకే ఒక్క రూపాయికి చక్కని భోజనం అందిస్తున్నారు. రోటీ కావాలంటే రోటీ, కూర అందిస్తున్నారు.  అన్నం, పప్పుతోపాటు చట్నీ కూడా పెడుతున్నారు. స్వీటు కూడా అందిస్తున్నారు.  

 

క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఇక్కడి వస్తే కడుపు నిండా తినవొచ్చు అన్న నమ్మకాన్ని కల్పిస్తున్నారు.  కర్ణాటకలోని హుబ్లీలో మహావీర్ యూత్ ఫౌండేషన్ ఈ వితరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. రోటీ ఘర్ పేరుతో ఆరేళ్లుగా చవకధరలకు భోజనం పెడుతోంది. వీరి వ్యవస్థ చాలా చిన్నదే అయిన వీరి సంకల్పం ఎంతో గొప్పగా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలు మధ్యాహ్నం అక్కడికి వెళ్లి ఆకలి తీర్చుకుంటున్నారు. స్వచ్ఛందగా ఈ సేవ చేస్తున్నామని ఫౌండేషన్ సభ్యులు చెప్పారు.  ఇలాంటి గొప్ప మనసు చాటుకుంటున్న వీరందరూ మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: