ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) జవాన్లు తాజాగా లడఖ్‌లో 17,000 అడుగుల ఎత్తులో భారత జాతీయ జెండాను ఎగురవేసి 74 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని బాగా జరుపుకున్నారు. ఐటిబిపి జవానులు సరిహద్దులో ఉన్న వివిధ వ్యూహాత్మక ప్రదేశాలకు తిరుగుతూ అనేక ప్రాంతాల్లో భారత జెండాను రెపరెపలాడించారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్లు 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరుపుకున్న వేడుకలకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.
21 మంది ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్ల సిబ్బంది సరిహద్దు వద్ద చైనా దళాలను పారద్రోలడానికి ఆర్మీతో కలిసి ధైర్యసాహసాలతో పోరాడారని.. ఆ 21 మంది జవాన్ల ధైర్యానికి గుర్తింపుగా పతకాలను సమర్పించ వలసిందిగా ఐటిబిపి భారత ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఏదేమైనా ఆ రోజున భారత దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన మహామహులు ఎంత కష్టపడ్డారో ఈ రోజున భారతీయుల స్వతంత్రాన్ని కాపాడేందుకు ఆర్మీ జవాన్లు అదే స్థాయిలో కష్టపడుతున్నారు. అందుకే ఈరోజున ప్రతి ఒక్క భారతీయుడు భారత సైనికులకు నిలుచుని సెల్యూట్ చేయాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి