ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో ఒకడైన దావూద్ ఇబ్రహీమ్ కోసం అగ్ర దేశాలు గత  కొన్నేళ్లుగా వెతుకుతున్నాయి. బయటకు కనిపించకుండా ఎన్నో అక్రమాలకు ఉగ్ర చర్యలకు పాల్పడిన దావూద్ 1993  ముంబై పేలుళ్లలో కీలకంగా వ్యవహరించాడు. అందుకు కొన్ని ఆధారాలు కూడా లభించాయి. ఇక హిందీ సినిమా ఇండస్ట్రీని కూడా ఒకప్పుడు  కనుసైగలతో శాసించిన దావూద్ తో ఒక హీరోయిన్ ఇంకా సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తోంది అనే రూమర్స్ వస్తున్నాయి. దావూద్ ఇబ్రహీమ్ కి ఇండియాలోనే కాకుండా పాకిస్థాన్ సినిమా ఇండస్ట్రీతో కూడా చాలా దగ్గరి  సంబంధాలు ఉన్నాయి. ఇండియాలో అయితే కొన్ని పెద్ద సినిమాలకు పెట్టుబడులు పెట్టినట్లు అప్పట్లో టాక్ గట్టిగానే వచ్చింది. ఇక అగ్ర  హీరోలు హీరోయిన్స్ కూడా అతనితో చాలా వరకు సన్నిహితంగానే ఉండేవారని కూడా రూమర్స్ వచ్చాయి.


పాకిస్థాన్ కి చెందిన ఒక అందమైన హీరోయిన్ కి దావూద్ ఇబ్రహీమ్ తో సంబంధాలు ఉన్నట్లు ఆ దేశంలోనే అనేక రకాల  వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు మెహ్విష్ హయత్ అని తెలుస్తోంది. మొదట ఐటెమ్ గర్ల్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఆ  తరువాత దావూద్ కి ఒక నిర్మాత ద్వారా క్లోజ్ అయినట్లు టాక్. దావూద్ తో ఎఫైర్ కొనసాగించిన  తరువాత పాకిస్థాన్ సినిమా ఇండస్ట్రీలో ఆమెకు భారీ ఆఫర్స్ వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అలాగే ఆ దేశంలో అత్యంత  ప్రతిష్ఠాత్మకమైన తంగా పురస్కారం కూడా దావూద్ కారణంగానే మెహ్విష్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే మెహ్విష్ పై దావూద్ కన్ను  పడిందో అప్పటి నుంచి ఆమె లైఫ్ స్టైల్ కూడా మారిందని కామెంట్స్ వస్తున్నాయి.

కొన్నాళ్లకు  ముందు ఇండియాలోనే అండర్ గ్రౌండ్ డాన్ గా ఉన్న దావూద్ ఆ తరువాత పాకిస్థాన్ కి మకాం మార్చాడు. దావూద్ ఎక్కడ ఉన్నాడో పాకిస్తాన్ కు స్పష్టంగా తెలిసినా.. అతడికి ఐఎస్ఐతో రక్షణ కల్పిస్తూ.. ఆచూకీ లేడని ప్రపంచాన్ని నమ్మిస్తోంది. చివరకు ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ ను గ్రే లిస్టలో చేర్చినా సరే.. దావూద్ ఆచూకీ చెప్పడానికి మాత్రం పాక్ నిరాకరిస్తోంది. పైగా దావూద్ తమ భూభాగంలో లేడని బుకాయిస్తోంది. మెహ్వీష్ హయత్ తో అఫైర్ వివరాలు బయటకు ఎలా బయటకు వెళ్లాయన్నది తెలుసుకోడానికి తన పర్సనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఆదేశించినట్టు  తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: