పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు కి చెందిన రాజకీయనాయకుడు. స్వతహాగా అనిల్ కుమార్ యాదవ్ డాక్టర్ వృత్తికి చెందిన వారైనా ప్రజలపై ఇష్టంతో ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు రాజకీయాన్ని ఎంచుకోవడం జరిగింది. స్వతహాగా అతని బాబాయ్ సుధాకర్ రాజకీయాల్లో ఉండేవారు, అతని మరణంతో రాజకీయ ప్రవేశం చేసిన అనిల్ కుమార్ యాదవ్ వెనుతిరిగి చూసే పరిస్థితి కనపడలేదు. అంతలా కలిసొచ్చాయి అతనికి రాజకీయాలు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది. నెల్లూరు లో ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.  నెల్లూరు నుండి అనిల్ కుమార్ యాదవ్ నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు.





అదే సమయంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితానికి తుది మెరుగులు దిద్దుకున్నాడు. అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడే నెల్లూరు బడా నాయకులకు మరియు రాష్ట్రంలోని ఇతర రాజకీయ నాయకులకు అనిల్ కుమార్ యాదవ్ అంటే ఏంటో తెలిసింది. జగన్ కు చాలా నమ్మకంగా తను ఏది చెప్తే అది చేసే విధంగా  నిరాడంబరత తో    వైయస్సార్    పార్టీ లో   కొనసాగాడు. ముఖ్యంగా జగన్ అవినీతి కేసులో జైలుకు వెళ్లిన సమయంలో అనిల్ కుమార్ యాదవ్ దాదాపు అన్నిరోజులూ నల్ల దుస్తులు ధరించి తన సంఘీభావం ప్రకటిస్తూ,  ప్రతిపక్షం మీద తనదైన శైలిలో సమయం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతూ ఉండేవాడు.




ఈ విధంగా జగనన్నను ఎవరు ఏమి విమర్శించినా కూడా వారి పై ప్రతి విమర్శలు చేసేవరకూ నిద్రపోయేవాడు కాదు. ఈ విధంగా సాగుతున్న సమయంలో 2019 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి తన ప్రత్యర్థి, అప్పటి మంత్రి అయిన పొంగూరు నారాయణ. అందరూ నారాయణ చేతిలో అనిల్ కుమార్ యాదవ్ గెలవడం అసాధ్యం అనుకున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎన్నో రెట్లు బలమైన నారాయణ చేతిలో అనిల్ ఓడిపోతారు అనుకున్నారు. కానీ ఎంతో ఉత్కంఠగా జరిగిన నెల్లూరు అసెంబ్లీ ఎన్నికలలో అనిల్ కుమార్ యాదవ్ తన ప్రత్యర్థి టిడిపి నాయకుడైన పొంగూరు నారాయణ ను స్వల్ప మెజారిటీతో ఓడించాడు.




అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అంటే టాక్ ఆఫ్ ద స్టేట్ అయింది. 2019 ఎన్నికలలో వైయస్సార్ సి పి 151 సీట్లతో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ నమ్మకానికి, పట్టుదలకి, శ్రమకి మెచ్చిన జగన్ అనిల్ కుమార్ యాదవ్ ని నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించాడు. అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ, ప్రజా సమస్యలను కూడా తనదైన శైలిలో పరిష్కరించుకుంటూ పోతున్నాడు. ఇప్పటివరకైతే అనిల్ తన రాజకీయ జీవితాన్ని సాఫీగానే సాగిస్తున్నాడు. మరి భవిష్యత్తులో ఏ విధంగా మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: