ప్రస్తుతం కరోనా  వైరస్ దేశవ్యాప్తం గా శరవేగం గా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటి కీ కరోనా వైరస్ పంజా విసురుతుంది. దీంతో ఎన్ని నియంత్రణ ప్రయత్నాలు చేపట్టిన ఫలితం లేకుండా పోతుంది. రోజు రోజుకు ప్రజలు భయాందోళన పెరిగిపోతుంది. ప్రజలందరూ కరోనా  వైరస్ తో సహ జీవనం చేయక తప్పదు అని భావించి ప్రస్తుతం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రోజువారీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యం లో... మహమ్మారి కరోనా వైరస్ మరింత శరవేగంగా వ్యాప్తిచెందుతూ ఎంతో మంది పై పంజా విసురుతోంది.



 కరోనా వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుందని ప్రజలందరిలో ఆందోళన పెరిగిపోతుంది. అదే సమయంలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని చెబుతున్నప్పటికీ  మరోవైపు ప్రాణాలు సైతం పోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలందరిలో రోజురోజుకు భయాందోళన పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే అటు అధికారులు కూడా మహమ్మారి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో అప్రమత్తంగా ఉండాలని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న విషయం తెలిసిందే.




 ముఖ్యంగా పండుగల సీజన్లో కరోనా వైరస్ మరింత విజృంభించి పంజా విసిరే అవకాశం ఉందని డిసెంబర్ వరకు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రజలందరినీ హెచ్చరించారు. పండుగలను బయట కాకుండా  ఇంట్లోనే ఉండి జరుపుకోవడం ద్వారా కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు అంటూ సూచించారు. అంతేకాకుండా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలని ఎలాంటి  లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి అని తెలిపారు. మాస్క్ భౌతిక దూరం పాటించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: