దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు  సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన అన్ని సంస్థలు తమ సంస్థ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తు నిర్ణయం తీసుకోవడంతో ఎంతో మంది నిరుద్యోగులుగా మారిన విషయం తెలిసిందే. ఇక కరోనా  వైరస్ సంక్షోభం కారణంగా ఎక్కడ ఉపాధి దొరికే అవకాశం లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఎంతగానో దెబ్బ తిన్నాయి. కనీసం తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వచ్చాయి.



 ఇక మరికొంత మంది ఉపాధి లేక కనీసం కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే కరోనా సంక్షోభం సమయంలో లోను తీసుకుని ఈఎమ్ఐ కట్టే వారికి కేంద్ర ప్రభుత్వం మారటోరియం ప్రకటించి అండగా నిలిచిన విషయం తెలిసిందే. మారటోరియం ద్వారా కొన్ని నెలలపాటు ఈఎంఐ కట్టనవసరం లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కరోనా  సంక్షోభం సమయంలో ప్రజలందరికీ ఆర్థికంగా అండగా నిలిచింది. ఇక ఇప్పుడు మారటోరియం పై మరోసారి కీలక నిర్ణయం తీసుకుని అందరికీ శుభ వార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.




 లోన్లు తీసుకున్న వారికి మారటోరియం ఆరు నెలల కాలానికి వడ్డీపై వడ్డీ  మాఫీ చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నవంబర్ 2 లోపు కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. మారటోరియం ఆరు నెలల కాలానికి వడ్డీపై వడ్డీ  మాఫీ చేసే నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. రెండు కోట్ల లోపు రుణాలపై చక్ర  వడ్డీ మాఫీ చేసేందుకు కేంద్ర క్యాబినెట్  నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎంతో మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: