మోడీ అనగానే మనకు ప్రధాని నరేంద్ర మోడీనే గుర్తుకొస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటినుంచి ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇప్పుడు మన దేశంలోని మరో రాష్ట్రానికి మరో మోడీ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, ఆ పార్టీ నేత కుమార్ మోడీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుశీల్ కుమార్ మోడీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ విపత్తు తర్వాత భారత్ లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై ఏమాత్రం ప్రజా వ్యతిరేకత కనపడటం లేదని అంచనా వేస్తున్నాయి.

అక్టోబర్ 28తో మొదలై నవంబర్ 7వరకు మూడు విడతల్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగిస్తుందని ఏబీపీ-సి ఓటర్ సర్వే తేల్చి చెబుతోంది. 243 స్థానాల బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 135నుంచి 159 స్థానాలు కైవసం చేసుకుంటుందని చెబుతోంది ఈ సర్వే. బీజేపీకి 73నుంచి 81 సీట్లు వస్తాయని ఎన్డీఏ కూటమిలో అదే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనాలున్నాయి. అదే జరిగిదే బీజేపీ సీనియర్ నేత కుమార్ మోడీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుశీల్ కుమార్ మోడీ బీహార్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడం ఖాయం. దీంతో దేశంలో రెండో మోడీ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టవుతుంది.
లాక్ డౌన్ కష్టాలతో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా మారారన్న వార్తలు ఓవైపు, అధికారపక్షంపై సహజంగానే ఉన్న వ్యతిరేకత మరోవైపు ఉండగా.. ఎన్డీఏ కూటమికి విజయం నల్లేరుపై నడక కాదని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఇక ఆర్జేడీ సభలకు తండోపతండాలుగా వస్తున్న జనం, చిరాగ్ పాశ్వాన్ ఆకట్టుకునే హామీలు, కాంగ్రెస్ పై సింపతీ అన్నీ కలసి ఎన్డీఏ విజయానికి గండి కొడతాయని కూడా అనుకున్నారు. అయితే ఏబీపీ-సి ఓటర్ జరిపిన ఒపీనియన్ పోల్స్ ఊహించని విధంగా ఎన్డీఏ కూటమిదే విజయం అని తేల్చాయి. అందులోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని కూడా ఈ సర్వే చెబుతోంది. దీంతో సుశీల్ మోడీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని తేలిపోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: