భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి రోజు రోజుకు హాట్ హాట్ గా మారిపోతుంది. చైనా సృష్టించిన వివాదాన్ని భారత్ ముగించేలా కనిపిస్తోంది. మొదట్లో చైనా భారత్ పై ఆధిపత్యం సంపాదించేందుకు సరిహద్దు వివాదం సృష్టించినప్పటికీ ఆ తర్వాత భారత వ్యూహాల ముందు చైనా ఎటూ తేల్చువాలో  తెలియని అయోమయ స్థితిలో పడిపోయింది. సరిహద్దులో చైనా కు ధీటుగా బదిలు  అవడంతో పాటు మరోవైపు చైనా వ్యూహాత్మక ప్రదేశాలను కూడా భారత్ స్వాధీనం చేసుకోవడంతో చైనా మళ్లీ బేరసారాలకు దిగడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే భారత్-చైనా సరిహద్దు లో ఏ క్షణంలో యుద్ధం జరుగుతుంది అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంకండి అంటూ ఆ దేశ సైన్యానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తం అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా భారత ఆర్మీ రోజు రోజుకు మరింత సరికొత్త టెక్నాలజీతో కూడిన ఆయుధాలను చేర్చుకుంటూ  ఎంతో  శక్తివంతంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే అజిత్ ధోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 స్వార్ధపూరిత రాజకీయాల కోసం భారత్ ఎవరితోనూ యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు అంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. ఇక భారత్ చైనా సరిహద్దు లో ఉద్రిక్తత కొనసాగుతూ రోజురోజుకు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఇటీవల భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చేసిన వ్యాఖ్యలు కీలకం గా మారిపోయాయి. కేవలం దేశ రక్షణకు భంగం వాటిల్లుతుంది అని భావించినప్పుడు మాత్రమే భారత్  యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది అంటూ ఆయన తెలిపారు. దేశం భావోద్వేగ బంధం.. ఇది ఆధ్యాత్మిక సంస్కృతి వల్ల ఏర్పడింది.. ఏదో ఒక సామూహిక భావన అంటూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: