తెలుగుదేశం పార్టీ కాసేపటి క్రితం రాష్ట్ర పార్టీ కమిటీని ప్రకటించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ పదవులను ప్రకటించారు. 219 మందితో  తెదేపా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసారు. ఈ కమిటీలో కీలక నేతలకు చోటు కల్పించారు. 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, ఒక కోశాధికారి ఉండగా... బడుగు, బలహీన, ఎస్సీలకు 61 శాతం పదవులు రాష్ట్ర కమిటీలో ఇచ్చారు. 50 ఉపకులాలకు ప్రాధాన్యం ఇచ్చారు అధినేత చంద్రబాబు.

బీసిలకు 41 శాతం, ఎస్సీలకు 11 శాతం, ఎస్టీలకు 3 శాతం ఇవ్వగా మైనార్టీలకు 6శాతం మందికి కొత్త కమిటీలో చోటు కల్పించారు. ఇక ఈ రాష్ట్ర కమిటీలో ఉన్నవారి సగటు వయసు 48 ఏళ్లు... అంటే యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఒక్కసారి పదవుల విషయం చూస్తే...

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు : నిమ్మల కిష్టప్ప, ప్రత్తిపాటు పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావ్, పరసరత్నం, దాట్ల సుబ్బరాజు, పిడతల సాయికల్పనరెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్, సుజయ్ కృష్ణ రంగారావు, బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, వైవీబీ రాజేంద్రప్రసాద్, జి.తిప్పేస్వామి, వి.హనుమంతరాయచౌదరి, పుత్తా నరసింహారెడ్డి, దామచర్ల జనార్ధన్ రావు, శ్రీధర కృష్ణారెడ్డి, వేమూరి ఆనందసూర్య

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు : గౌనివారి శ్రీనివాసులు, ద్వారాపురెడ్డి జగదీష్, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, గూడూరి ఎరిక్షన్ బాబు, పరిటాల శ్రీరామ్, కాకి గోవిందరెడ్డి, నాగుల్ మీరా, గొట్టిపాటి వెంకటరామకృష్ణ ప్రసాద్, ఆనం వెంకటరమణ రెడ్డి, గంజి చిరంజీవులు, రుద్రరాజు పద్మరాజు, పిల్లి మాణిక్యాలరావు, మద్దిపట్ల సూర్యప్రకాష్, డా.సప్తగిరి ప్రసాద్, మొకా ఆనంద్ సాగర్, దివ్యవాణి, డా.ఎన్.బి.సుధాకర్ రెడ్డి, సయ్యద్ రఫి.

 టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శులు : పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, దేవినేని ఉమ, ఎన్.అమర్నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎండీ నజీర్, డోలా బాలవీరాంజనేయస్వామి, బీటీ నాయుడు, గన్ని కృష్ణ, పంచుమర్తి అనురాధ, బత్యాల చెంగల్రాయుడు, గౌతు శిరీష, దువ్వారపు రామారావు, బుద్ధా వెంకన్న, చింతకాయల విజయ్, మద్దిపాటి వెంకటరాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: