ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బిజెపి నేతలు కొంతమంది కేంద్ర మంత్రి పదవులు పై చాలా ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి అదేవిధంగా మరో ఎంపీ సీఎం రమేష్ ఎప్పుడు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా మరో ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఇప్పుడు తనకు కేబినెట్ లో బెర్త్ దక్కే అవకాశం ఉంది అనే దానిపై చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధారంగా చూస్తే ఎవరికి క్యాబినెట్లో అవకాశం దొరుకుతుంది ఏంటి అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది.

అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల కేంద్ర మంత్రి పదవి సుజనా చౌదరికి దక్కే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. కమ్మ సామాజికవర్గ నేతలను కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో తమ వైపు తిప్పుకోవాలి అంటే కచ్చితంగా ఆయన సహకారం అనేది ఇప్పుడు బీజేపీ కి కావాల్సి ఉంది. దీనితోనే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నారు అని సమాచారం. కమ్మ సామాజిక వర్గం నేతలు బీజేపీ లోకి తీసుకుని వెళ్తే ఈ నాలుగు జిల్లాల్లో కూడా బలపడే అవకాశం ఉంటుంది.

అంతే కాకుండా ప్రకాశం జిల్లా అనంతపురం జిల్లాలో కూడా కమ్మ సామాజిక వర్గానికి మంచి పట్టు ఉంది. కాబట్టి ఈ జిల్లాల మీద ఆయన  సహకారతో ఎక్కువగా పావులు కదుపుతోంది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. అలాగే విశాఖ జిల్లాలో కూడా కొంతమంది కీలక కమ్మ సామాజికవర్గ నేతలు ఉన్నారు. వారిని కూడా బీజేపీ లోకి తీసుకు రావడానికి ఇప్పుడు సుజనాచౌదరిని వాడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ రాజకీయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. తెలంగాణలో కూడా ఆయనకు మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: