ఏకంగా పాకిస్తాన్ లో ఉన్న ఫ్రాన్స్ దౌత్య కార్యాలయానికి చుట్టు ముట్టి ఏకంగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం కూడా చేసింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్‌తో ఫాన్స్ కి ఉన్న అన్ని సంబంధాల ను తెంచుకునేందుకు ఫ్రాన్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో నే ఫ్యాన్స్ వెంటే ప్రస్తుతం యూరోపియన్ దేశాలు అన్ని నడుస్తున్నాయి. అదే సమయంలో ఇటీవల భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ప్రయత్నించింది పాకిస్తాన్. అంతే కాకుండా పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది.. దీంతో విజృంభించిన భారత సైన్యం ఎడతెరిపి లేకుండా కాల్పులు జరిపింది. దీంతో పాకిస్థాన్ కోలుకోలేని దెబ్బ తగిలింది అని చెప్పాలి.
అంతేకాకుండా ఎఫ్ఏటీఎఫ్ వ్యవహారాలను అడ్డంపెట్టుకుని పాకిస్తాన్ ఏదో చేయాలనుకుంటే ప్రస్తుతం కథ అడ్డం తిరిగింది. ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపై దాడి చేయడంతో ఏకంగా యూరోపియన్ యూనియన్ పాకిస్థాన్‌పై రగిలిపోతుంది. ప్రపంచ దేశాలు పాకిస్థాన్ పై కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలా అన్ని వైపుల నుంచి పాకిస్థాన్‌కు వరుసగా కోలుకోలేని దెబ్బ తగులుతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి