మనం కొత్తిమీరను కూరలో కానీ, బిర్యానీలో కానీ, ఫ్లవారింగ్ కోసం వాడుతుంటాము. కొత్తిమీర కేవలం కళ్లకు చూడడానికి మాత్రమే మంచిదని అనుకుంటారు. అంతేకాదు కొత్తిమీర ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే కొత్తిమీరను ప్రతీ రోజు తీసుకోవడం ద్వారా శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. కొత్తిమీరను ప్రధానంగా ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కొత్తిమీరను సలాడ్లు రసాల రూపంలో తీసుకుంటే, ఇది ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. కొత్తిమీరను తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాల ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దామా.

కొత్తిమీరను రోజు తీసుకోవడం వలన  కడుపుతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలను తొలగిస్తుంది. ఇక శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది. మీరు కొత్తిమీరను ఉడకబెట్టడం లేదా రసం లాగా తీసుకుంటే.. అందులోని ఫైబర్, ముఖ్యమైన నూనె కాలేయానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.కొత్తిమీరలో ఓ ప్రత్యేక మూలకం ఉంటుంది. ఇది శరీరం నుంచి టైఫాయిడ్ బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అయితే కొత్తిమీర రసాన్ని తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదు కొత్తిమీర కొలెస్ట్రాల్ ‌ను కూడా తొలగిస్తుంది. ఈ రసం తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. కొత్తిమీర జలుబు, దగ్గు వంటి సమస్యలను నుండి విముక్తి కలిగిస్తుంది. ఇక కొత్తిమీర రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ నోరు, శ్వాస నుంచి వచ్చే చెడు శ్వాస సమస్యని నివారిస్తాయి. కొత్తిమీర రసాన్ని తప్పకుండా తీసుకుంటే అల్సర్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. పీరియడ్స్ లో సరైన సమయానికి రాకుండా ఇబ్బంది పడుతున్న మహిళలు కొత్తిమీర రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. తద్వారా వారు ఆ సమస్య నుంచి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: